అవరోధాలు అధిగమిస్తే విజయమే | - | Sakshi
Sakshi News home page

అవరోధాలు అధిగమిస్తే విజయమే

Mar 8 2026 7:50 AM | Updated on Mar 8 2026 7:50 AM

అవరోధాలు అధిగమిస్తే విజయమే

మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. 2004లో డిగ్రీ పుర్తయిన నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్‌ ప్రారంభించాను. ఈ క్రమంలో 2009లో వివాహం జరిగింది. అయినా పరీక్షలు రాయడం మానలేదు. వివాహం అయిన తర్వాత కొంత విరామం వచ్చినా కుటుంబం, భర్త సహకారంతో వాటిని అధిగమించడంతో 2010లో అటవీ శాఖాధికారిగా ఎంపికయ్యాను. ఆ సమయంలో ప్రెగ్నెన్సీతో ఉండడంతో 2011లో రెండు సంవత్సరాల శిక్షణ కోసం నెలల బిడ్డను అమ్మ దగ్గర వదిలి డెహ్రడూన్‌ వచ్చాను. కఠోర శిక్షణ, కుటుంబం, నెలల బిడ్డ చాలాసార్లు నాతో నేనే పోరాడిన సందర్భాలున్నాయి. అయినా వెనుకడుగు వేయలేదు. మానసిక స్థైర్యంతోనే ముందుకు నడిచాను. ఇంట్లో పనులు నేనే చేసుకుంటాను. ఉద్యోగ బాధ్యతల్ని మరో పక్క చూసుకుంటాను. ముఖ్యంగా మహిళలకు సహనం చాలా ముఖ్యం. సహనంతోనే ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంటుందని నా జీవితం నాకు నేర్పింది...

ఎం.హిమ శైలజ,

జిల్లా అటవీశాఖాధికారిణి, గుంటూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement