నృసింహుని ఆలయం ద్వారబంధనం | - | Sakshi
Sakshi News home page

నృసింహుని ఆలయం ద్వారబంధనం

Mar 4 2026 7:44 AM | Updated on Mar 4 2026 7:44 AM

నృసింహుని ఆలయం ద్వారబంధనం 133 కేవీ లైన్‌లో భారీ అగ్ని ప్రమాదం మాచర్ల: చంద్రవంక బ్రిడ్జి పక్కన ఉన్న 133 కేవీ లైనులో సోమవారం అర్ధరాత్రి షార్క్‌ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ప్రమాదం జరడంతో 133 కేవీకి సంబంధించి విద్యుత్‌ సరఫరా అయ్యే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి మాచర్ల పట్టణంతోపాటు, రెంటచింతల ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ. 30 లక్షల విలువ చేసే విద్యుత్‌ పరికరాలు దగ్ధమైనట్లు డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్‌.సింగయ్య తెలిపారు. చంద్ర గ్రహణం కారణంగా అమరేశ్వరాలయం మూసివేత అమరావతి:రపసిద్ధ శైవక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ బుధవారం వేకువజామున ఆలయశుద్ధి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. అనంతరం అమరేశ్వర స్వామివారికి, బాలచాముండేశ్వదేవి అమ్మ వారికి, ఉపాలయాలలో అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కోటప్పకొండ ఆలయం మూసివేత

మంగళగిరి టౌన్‌ : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం తలుపులకు మంగళవారం ద్వారబంధనం చేశారు. ఎగువ, దిగువ, ఉపాలయాలను రథోత్సవం అనంతరం ఉదయం 9 గంటలకు ఆలయ అధికారి సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో దేవస్థాన పురోహితులు తలుపులు మూసివేశారు. గ్రహణ శుద్ధి అనంతరం బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఎగువ, దిగువ సన్నిధుల్లో స్వామివార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు.

నరసరావుపేట రూరల్‌: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 6 గంటలకు ఆలయాన్ని సిబ్బంది మూసివేశారు. శైవాగమ ప్రకారం సంప్రోక్షణ కార్యక్రామాన్ని నిర్వహించిన అనంతరం బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తామని ఆలయ ఈవో డి.చంద్రశేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement