లక్ష్మీపురం (గుంటూరు ఈస్ట్): పెద్ద స్థాయి లాజిస్టిక్స్, ఫుల్‌పిల్మెంట్ నెట్‌వర్క్‌లను మార్చడంలో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ)ను ప్రధానంగా ఉపయోగిస్తున్న అమెరికాలో అమెజాన్.కామ్ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆ సంస్థకు చెందిన సప్లయి చైన్ మేనేజర్ తేజా భరత్ నెల్లూరి అన్నారు. గుంటూరు రత్నగిరినగర్‌కు చెందిన యువకిషోరం తేజా భరత్ నెల్లూరి శివరావు, శ్రీవాణి దంపతుల ఏకై క కుమారుడు. గుంటూరు ఏఎన్‌యూలో 2010–2014 బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసుకుని 2019–2021లో అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ సమయంలో క్యాంపస్ సెలక్షన్ ద్వారా అమెరికాలోని అమెజాన్.కామ్ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో సప్లయి చైన్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి రాణిస్తున్నారు. ఇటీవల గుంటూరుకు రావడంతో ప్రత్యేక ఇంటర్వ్యూలో గ్లోబల్ సప్లయి చైన్ ఎలా పునర్నిర్మిస్తుందో, భవిష్యత్తులో ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోందో ‘సాక్షి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రశ్నః ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల మార్పు, సప్లయి చైన్ పై ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతోంది?
సమాధానంః ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సప్లయి చైన్ అనేది అత్యంత క్లిష్టమైన నిర్మాణం. మిలియన్ల ఉత్పత్తులు, గ్లోబల్ మార్గాలు, రియల్–టైమ్ అవసరాలు, బాహ్య ప్రమాదాల నేపధ్యంలో ఏఐ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా ఏఐ డిమాండ్‌ను అంచనా వేయడం, ఆటోమేట్ చేయడం, వేగంగా స్పందించడం వంటి అంశాలలో సంప్రదాయ వ్యవస్థలను మించిపోతుంది.
మీ దష్టిలో ప్రస్తుతం అత్యంత ప్రభావం చూపుతున్న ఏఐ ఇన్నోవేషన్‌లు ఏవి?
నా అనుభవంలో, అత్యంత మార్పు తీసుకొస్తున్న ఐదు ప్రధాన రంగాలు ఆరు. ప్రిడిక్టివ్ ఫోర్‌కాస్టింగ్, ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్, ఆటోమేటెడ్ వేర్‌హౌసింగ్, డైనమిక్ ట్రాన్స్‌పోర్టేషన్ రూటింగ్, రిస్క్ డిటెక్షన్. ఈ ఇన్నోవేషన్‌లు సప్లయి చైన్‌లో ఖచ్చితత్వం సామర్‌ాధ్యన్ని పూర్తిగా మారుస్తున్నాయి.
ఏఐ నిజంగా సప్లయి చైన్ అంతరాయాలను నివారించగలదా?
ఏఐ ప్రతి సమస్యను 100శాతం నివారించలేదు. కానీ ఇది చేసే అత్యంత ముఖ్యమైన విషయం తీవ్ర ప్రమాదాలను ముందే గుర్తించడం. నా పనిలో, వాతావరణం, పోర్ట్ డేటా, రవాణా బాటిల్ నెక్కులు, గ్లోబల్ న్యూస్ వంటి వేలాది సూచనల్ని ఏఐ ఎలా విశ్లేషిస్తుందో చూశాను. ఈ ముందస్తు హెచ్చరికలు కంపెనీలకు రీరూటింగ్, రీషెడ్యూలింగ్, ఇన్వెంటరీ బ్యాలెన్సింగ్ లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఇస్తాయి. ఇది సప్లయి చైన్‌ను ప్రతిస్పందనాత్మక వ్యవస్థ నుంచి ప్రో–యాక్టివ్ వ్యవస్థగా మారుస్తుంది.
రాబోయే దశాబ్దంలో ఏఐ సప్లయి చైన్‌ను ఏ దిశలో తీసుకెళ్తుందని మీరు భావిస్తున్నారు?
మనం పూర్తిగా కనెక్ట్ అయి, స్వయంచాలకంగా ఆప్టిమైజ్ అయ్యే సప్లయి చైన్ దిశగా కదులుతున్నాం. భవిష్యత్తులో ఏఐ ట్రాన్స్‌పోర్టేషన్, ఇన్వెంటరీ, లేబర్, రిస్క్ ఆల్ ఇన్ రియల్ టైమ్‌లో సమన్వయం చేస్తుంది. ఇంటెలిజెంట్ కంట్రోల్ టవర్లు ఆపరేషన్‌లపై పూర్తి, ఏకీకత దృశ్యం ఇస్తాయి. నేను చూసిన విధంగా, ఈ డిజిటల్ మార్పు ఇప్పుడే ప్రారంభమైంది. దీని ప్రభావం చాలా దీర్ఘకాలికం మరియు శక్తివంతంగా ఉంటుంది.


