ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Mar 13 2026 8:11 AM | Updated on Mar 13 2026 8:11 AM

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌

నెహ్రూనగర్‌: వారంతా నాలుగు పదులకుపైగా వయస్సు గలవారు. వయస్సుతో పనిలేకుండా పరుగులెత్తారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు మూడు రోజులపాటు స్పోర్ట్స్‌ మీట్‌ గురువారం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ హనుమంతు, ఎకై ్సజ్‌ శాఖ డెప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసులు, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌లు అరుణకుమారి, మణికంఠలు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. మొదటి రోజు 50, 100, 200 మీటర్లు రన్నింగ్‌, 400 మీటర్లు వాకింగ్‌, టెన్నికాయిట్‌, ట్రిపుల్‌ జంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో, చెస్‌, క్యారమ్స్‌, వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. నేడు క్రికెట్‌ ఇతర క్రీడలు ఉంటాయని డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు దుర్గాప్రసాద్‌, శ్రీలత, ఏఈఎస్‌లు మారయ్యబాబు, రవీంద్రలు, రాష్ట్ర గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహ, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కామేశ్వరరావు, కానిస్టేబుల్స్‌ అండ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రమణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యశోధర దేవి, ఉమ్మడి గుంటూరు జిల్లా కానిస్టేబుల్స్‌ అండ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కోటయ్య, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, మినిస్టీరియల్‌ సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

గుంటూరు ఇంజినీర్‌కు గుర్తింపు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరుకు చెందిన యువ ఇంజినీర్‌ ఆకెళ్ళ నరసింహ సాయినాథ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయిలో డైమెన్షనల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో గణనీయమైన ముద్ర వేసిన కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత హూస్టన్‌లోని టెస్లా సంస్థ నుంచి ఆఫర్‌ అందుకున్నారు. గుంటూరులో పుట్టి పెరిగిన సాయినాథ్‌ తన పాఠశాల విద్యను బ్రాడీపేటలోని సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం సత్తెనపల్లి మండలంలోని లయోలా ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పొందిన సాయినాథ్‌, గత దశాబ్దంలో అత్యంత సమర్థుడైన డైమెన్షనల్‌ ఇంజినీర్‌గా ఎదిగారు. ప్రతిష్టాత్మకమైన అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఏఎస్‌ఎంఈ), జీడీ అండ్‌ టీ, సీనియర్‌ లెవల్‌ సర్టిఫికేషన్‌ పొందారు. దాదాపు 30 మంది ఇంజినీర్లకు ఆయన మార్గదర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement