నేడు సీజేఐ సూర్యకాంత్ రాక
తాడికొండ: నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి తెలిపారు. ఆదివారం ఏపీ జ్యూడీషియల్ అకాడమి, క్లబ్ హౌస్ శంకుస్థాపన, హైకోర్టు అతిథి గృహాల ప్రారంభోత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ప్రముఖుల పర్యటనకు రాజధాని రహదారులను ముస్తాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాజధానిలో ప్రధాన మార్గమైన సీడ్ యాక్సెస్‌రోడ్డులో రాయపూడి, దొండపాడు వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు పనులు, ప్రధాన కూడళ్ల వద్ద బీటీ లేయర్ పనులను ఆమె పరిశీలించారు. ముఖ్యంగా ఎన్–16, ఎన్–17, ఈ– 4 రహదారులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉండగా వాటిని బీటీ రహదారులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీరు బి.నరసింహమూర్తి, టి.మోజెస్ కుమార్ పాల్గొన్నారు.


