చంద్రబాబు, లోకేష్‌ డైరక్షన్‌లోనే విధ్వంసకాండ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేష్‌ డైరక్షన్‌లోనే విధ్వంసకాండ

Mar 1 2026 7:54 AM | Updated on Mar 1 2026 7:54 AM

చంద్రబాబు, లోకేష్‌ డైరక్షన్‌లోనే విధ్వంసకాండ

చంద్రబాబు, లోకేష్‌ డైరక్షన్‌లోనే విధ్వంసకాండ

చంద్రబాబు, లోకేష్‌ డైరక్షన్‌లోనే విధ్వంసకాండ ● ఆ రోజు తన ఇంటి వద్ద, కార్యాలయం వద్ద, తనను చంపేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. లోకేష్‌ కార్యాలయంలో ఉండి, ఈ దాడికి ఉసిగొల్పారని ధ్వజమెత్తారు. పోలీసులు నిర్వీర్యంగా ఉండిపోయారని, కొట్టనీయండి అంటూ ఒక డీఎస్పీ మాట్లాడటం ఎంత వరకు సబబన్నారు. ● ఒకట్రెండు రోజుల్లో వైఎస్సార్‌ సీపీ లీగల్‌ విభాగంతో ముందుకెళ్తామని అన్నారు. కస్టోడియల్‌ టార్చర్‌పై హైకోర్టులో కేసులు ఫైల్‌ చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాలయం వద్ద కారు అద్దాలు పగులకొట్టడం తప్పేనని అన్నారు. కానీ తన కారు, తన ఇల్లు, తన కార్యాలయం, ఫర్నిచర్‌ ధ్వంసం చేస్తే రైటా అని అన్నారు. ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం పరామర్శించిన వారిలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, వల్లభనేని వంశీ, గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా, పార్టీ శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, ఎంపీపీ పద్మజరెడ్డి, జిల్లా అంగన్‌వాడీ అధ్యక్షురాలు లావణ్య, రాష్ట్ర అంగన్‌వాడీ కార్యదర్శి వెంకటజ్యోతి, రూరల్‌ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, కనిగిరి మండలం జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, వెలిగండ్ల మండలం జెడ్పీటీసీ ఉంటక తిరుపతిరెడ్డి, చెర్లపల్లి మండలం జెడ్పీటీసీ ఓకే రెడ్డి ఉన్నారు.

పవన్‌కల్యాణ్‌ కారు అద్దాలు పగలకొట్టడం తప్పు.. అంబటి ఇల్లు, కార్యాలయం ధ్వంసం చేయడం రైట్‌ మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌)/నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌) : నాలుగు వారాల క్రితం తన ఇల్లు, కార్యాలయం, కారు అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం అంతా చంద్రబాబు, లోకేష్‌ల డైరక్షన్‌లోనే జరిగిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు సిద్ధార్థనగర్‌లోని ఆయన కార్యాలయం వద్ద శనివారం మీడియాతో మాట్లాడారు.

అంబటి రాంబాబుకు పరామర్శ....

● రాష్ట్రంలో నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ ఎర్రి పరిపాలన ఆపి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్‌, కనిగిరి సమన్వయకర్త దద్దాల నారాయణయాదవ్‌లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement