విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి

Mar 1 2026 7:54 AM | Updated on Mar 1 2026 7:54 AM

విభిన

విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి

గుంటూరు మెడికల్‌: ఇంట్లోనే కేవలం రెండు నిమిషాల్లో పాలల్లో జరిగే కల్తీలు గుర్తించవచ్చని జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ చదలవాడ హరిబాబు తెలిపారు. దీనిపై ప్రచార పోస్టర్లును శనివారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌లో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ● ఈ సందర్భంగా జేసీ శ్రీవాత్సవ మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలు తెల్లటి గీతపడుతూ మెల్లగా కిందకు జారతాయని, కల్తీ పాలు గీత లేకుండా వేగంగా జారతాయన్నారు. ● మందపాటి నురగ వచ్చి అది అలానే ఉండిపోతే అందులో సర్ఫ్‌ లేదా షాంపు కలిపినట్లని, రెండు చుక్కలు అయోడిన్‌ కలిపితే పాలు ముదురు నీలం రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్లు తెలుసుకోవచ్చు అన్నారు. ● వేళ్ల మధ్య రుద్దినప్పుడు సబ్బులా జారినా, వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారినా అవి కృత్రిమ పాలుగా సింథటిక్‌ కలిపిన పాలని గుర్తించవచ్చన్నారు. ● కల్తీ పాలలో యూరియా కలిపినట్లయితే దానిలో కందిపప్పు పొడి నీలం రంగులోకి మారుతుందని అది యూరియాగా గమనించమని, లిట్మస్‌ పేపరును ఆ పాలలో ముంచితే ఎరుపు రంగు నుంచి నీలం కలర్‌ లోకి మారుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోమలి పద్మ, గర్తపురి కన్జ్యూమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు, జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యులు విరాళ నాగేశ్వరరావు, చేకూరి రాజశేఖర్‌, మునిపల్లె కవిత, బేబీ, సరోజిని, ప్రముఖ చిత్ర దర్శకుడు అబ్బూరి జిమ్మీ జాన్‌ పాల్గొన్నారు.

జేసీ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో పైన తెలిపిన అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. జిల్లాలో గ్యాస్‌ ఏజెన్సీలనందు 30 శాతం కంటే ఎక్కువగా నెగిటివ్‌ రెస్పాన్‌న్స్‌ వస్తున్నట్లు తెలిపారన్నారు. ప్రతి నెలా ముఖ్యమంత్రి చేస్తున్న సమీక్షలో అన్ని విషయాలు చర్చిస్తున్నారన్న విషయం గుర్తించాలన్నారు.

చౌక ధరల దుకాణాల విషయమై కూడా గత ఏడు మాసాలుగా జరుగుతున్న సర్వేలో ప్రజల నుంచి కొంతమంది డీలర్లపై నెగిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిందని, జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారన్నారు.

వృద్ధులు/దివ్యాంగులకు, మంచంలో ఉన్న వ్యాధిగ్రస్తులకు ప్రతినెల 26 నుంచి 31వ తేదీ వరకు వారి ఇంటి వద్దనే సరుకులు ఖచ్చితంగా పంపిణీ చేయాలన్నారు. కార్డుదారులకు బియ్యం తప్ప డబ్బులు ఇవ్వకూడదని, ప్రతి డీలరు పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ కోమలి పద్మ పాల్గొన్నారు.

‘గ్యాస్‌’ వసూళ్లు మానుకోవాలి

గుంటూరు వెస్ట్‌: విభిన్న ప్రతిభావంతుల సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల స్పెషల్‌ గ్రీవెన్స్‌ నిర్వహించారు. అర్జీలు అందించడానికి వచ్చిన విభిన్న ప్రతిభవంతుల వద్దకే జిల్లా కలెక్టర్‌ స్వయంగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. కదలలేని స్థితిలో ఆటోలో తీసుకువచ్చిన మంగళగిరికి చెందిన సింధు సాయి ఆటో వద్దకు వెళ్లి అర్జీ స్వీకరించారు. పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 46 అర్జీలు అందించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్‌ ఖాజావలి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయం సంచాలకులు వెంకటరవణప్ప, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ విజయలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ యశస్వి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కల్తీపాలను ఇంట్లోనే గుర్తించవచ్చు

గుంటూరు వెస్ట్‌: గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ బాయ్స్‌ ఖాతాదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేయడంతోపాటు అమర్యాదగా మాట్లాడుతున్న సంఘటనలు నమోదవుతున్నాయని అటువంటి వారిని విధుల నుంచి తొలగించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని మిని శంకరన్‌ సమావేశ మందిరంలో గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు, చౌకధరల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా

విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి 1
1/1

విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement