అమరేశ్వరస్వామి సేవలో ఇస్రో మాజీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

అమరేశ్వరస్వామి సేవలో ఇస్రో మాజీ చైర్మన్‌

Mar 1 2026 7:54 AM | Updated on Mar 1 2026 7:54 AM

అమరేశ

అమరేశ్వరస్వామి సేవలో ఇస్రో మాజీ చైర్మన్‌

వాహనదారులు సహకరించాలని వినతి మంగళగిరి టౌన్‌ : మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపులకు వాహనదారులు సహకరించాలని ఈవో కె. సునీల్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బ్రహోత్సవాల్లో భాగంగా మార్చి 5వ తేదీ వరకు ఆలయం చుట్టూ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, ప్రతిరోజ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఊరేగింపు ఉంటుందని తెలియజేశారు. ఆయా సమయాల్లో వాహనదారులు వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని, స్వామివార్ల ఊరేగింపునకు అసౌకర్యం కలగకుండా సహకరించాలని కోరారు.

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామిని శనివారం ఇస్రో మాజీ చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఇస్రో మాజీ చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ను దేవా లయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వర స్వామి, ,బాలచాముండేశ్వరీదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయఅర్చకులు ఇస్రో మాజీ చైర్మన్‌ కిరణ్‌కుమార్‌కు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు.

వైద్య కళాశాలకు ‘భాష్యం’ రూ. 4.50 లక్షల విరాళం

గుంటూరు ఎడ్యుకేషన్‌: భాష్యం విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ జన్మదినం సందర్భంగా భాష్యం పేరమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్‌ కళాశాలకు రూ.4.50 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం సంబంఽధిత మొత్తాన్ని చెక్కు రూపంలో భాష్యం రామకృష్ణ కుమార్తె భాష్యం జనని, భాష్యం మెడెక్స్‌ ప్రిన్సిపాల్‌ బి.హరిబాబు చేతుల మీదుగా గుంటూరు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్వీ సుందరాచారికి అందజేశారు. గతేడాది సైతం ఇదే ఇదే విధంగా ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్‌కు ఐదు శీతలీకరణ యంత్రాలను అందజేసినట్లు హరిబాబు తెలిపారు. సేవా భావంతో భాష్యం పేరమ్మ చారిటబుల్‌ ట్రస్టు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు, భాష్యం పూర్వ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

ఏఎన్‌యూ నూతన డైరీ ఆవిష్కరణ

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నూతనంగా ముద్రించిన విశ్వవిద్యాలయం డైరీ–2026ను ఉపకులపతి ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్టార్‌ ఆచార్య సింహాచలంలు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ మాట్లాడుతూ నాగార్జున విశ్వవిద్యాలయంలోని విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమాచారాన్ని డైరీ రూపంలో అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజిస్టార్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సొంతగా ముద్రించిన డైరీ ద్వారా పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. డైరీ ముద్రణ కమిటీ కన్వీనర్‌ ఆచార్య పద్మావతి మాట్లాడుతూ ఎంతో విలువైన సమాచారంతో అధ్యాపకులకు ఉపయోగపడే విధంగా ముద్రించామన్నారు.

అమరేశ్వరస్వామి సేవలో ఇస్రో మాజీ చైర్మన్‌ 1
1/1

అమరేశ్వరస్వామి సేవలో ఇస్రో మాజీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement