● నవంబర్, డిసెంబర్ నెలలో జరిగిన నాలుగు మాతృ మరణాలపై చికిత్స అందించిన వైద్యులు, ఆడిట్ చేసిన కమిటీ సభ్యులు, మృతుల బంధువుల నుంచి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. ఈ నాలుగు కేసులలో రెండు నివారించగలిగినవిగా, రెండు నివారించ లేనివిగా నిపుణులు పేర్కొనడం జరిగిందని, నివారించగలిగిన వాటిలో ఏ స్థాయిలో తప్పు జరిగిందో వాటిని సరిచేసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
● ప్రతి గర్భవతికి తప్పనిసరిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే అన్ని రకాల పరీక్షలు మొదటి త్రైమాసికం నుంచే చేయాలని, రిస్క్ ఉన్నవారికి అవసరం అయితే హయ్యర్ సెంటర్లకి రిఫర్ చేసి సుఖ ప్రసవం అయ్యే విధంగా చూడాలన్నారు. సర్జరీ చేసే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్‌లో ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓని ఆదేశించారు.
● గర్భవతులు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులు వాడే విధంగా ఎఎన్‌ఎం, ఆశాలు, వైద్యాధికారులు అవగాహన కల్పించాలన్నారు.
● అధిక రక్తహీనతతో బాధపడే గర్భవతులకు, బాలింతలకు రక్తం వృద్ధి చెందేందుకు ఇచ్చే ఇంజక్షన్ ఎఫ్‌సీఎంను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి లాంఛనంగా విడుదల చేశారు, జిల్లాలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో రూ.2వేలు విలువ కలిగిన ఈ ఇంజెక్షన్‌ను అవసరమైన గర్భిణులు, బాలింతలకు ఉచితంగా ఇస్తారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
● కేంద్ర ప్రభుత్వం ప్రజల హెల్త్ రికార్డు డిజిటలైజేషన్‌కు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌ను క్రియేట్ చేసే ఏబీహెచ్‌ఏ కార్యక్రమం ప్రచార పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో మాతృమరణాలు నివారించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, వైద్యాధికారులు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేలావిధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లాస్థాయి మాతృ మరణాల సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.
ఎఫ్‌సీఎం ఇంజెక్షన్ విడుదల
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ సుధారాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశశ్వి, ఎస్‌హెచ్‌ఏ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్‌లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వఆసుపత్రి పై అనేక ఫిర్యాదులు వస్తున్నందున గత నెల 27వ తేదీ రాత్రి ఆకస్మిక తనిఖీ చేశానన్నారు. ఆ సమయంలో డ్యూటీలో లేని డాక్టర్లను వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాలని పేర్కొన్నారు. అలాగే నైట్ షిప్ట్‌లలో విధులు నిర్వహించే డాక్టర్లు, ఇతర సిబ్బంది వివరాలు ఒక వారం రోజుల డ్యూటీ చార్డును అందించాలన్నారు. ఇవే వివరాలు ఆసుపత్రిలోను ప్రదర్శించాలన్నారు.