ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి
తాడికొండ: గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి అన్నారు. బుధవారం తుళ్ళూరు మండలం మందడంలోని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోస్టల్ శాఖలను మరింత బలోపేతం చేసేందుకు తగు చర్యలు తీసకుంటున్నామన్నారు. అనంతరం గోల్డెన్ రూల్ హైస్కూల్ నందు మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 21 బ్రాంచ్ ఆఫీసుల పనితీరును పరిశీలించారు. బ్రాంచ్ పోస్టుమాస్టర్లు వ్యాపారాభివృద్ధి, ఆదాయ వృద్ధి, వినియోగదారుల చేరువయ్యే కార్యక్రమాలలో చురుకై న పాత్ర పోషించాలన్నారు. తపాలా సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అనంతవరం బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోలు నరసింహారావు, పెనుమాక బ్రాంచ్ పోస్టు మాస్టర్ బానోత్ నాగమణి, వెంకటపాలెం బ్రాంచ్ పోస్టు మాస్టర్ షేక్ హనీఫ్ ఆమె అభినందించారు.


