టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు

Mar 10 2026 12:45 PM | Updated on Mar 10 2026 12:45 PM

● గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌ నాలుగవ లైనులోని ఎన్నారై స్కూల్‌ వద్ద సెంటర్‌ కోడ్‌: 54036 పేరుతో జారీ చేసిన హాల్‌ టికెట్‌లో ఉన్న విధంగా పరీక్ష కేంద్రం పేరును నారాయణ ఇంగ్లిషు మీడియం స్కూల్‌గా మార్చుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. ● డీఈవో ఆదేశాలతో పరీక్ష కేంద్రానికి వెళ్లిన ప్రభుత్వ పరీక్షల విభాగ జిల్లా సహాయ కమిషనర్‌ వెంకట్‌రెడ్డి, సిబ్బంది పేరు మార్చిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భవన యజమాని ఎన్నారై స్కూల్‌కు లీజుకు ఇవ్వడంతో పాఠశాల పేరు మారిందని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా హాల్‌ టికెట్లలో ఇచ్చిన విధంగానే పరీక్ష కేంద్రం ఉంటుందని డీఈవో సలీమ్‌ బాషా తెలిపారు. ● పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి డీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశామన్నారు.

‘కేంద్రాలకు వెళ్లడమే పెద్ద పరీక్ష’ కథనానికి స్పందన

టెన్త్‌ పరీక్షా కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని డీఈవో సలీమ్‌ బాషా ఆదేశాలు

గుంటూరులో పరీక్షా కేంద్రం పేరు

గుంటూరు ఎడ్యుకేషన్‌: టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల పేర్లలో తప్పులు, కేంద్రాలను కనుగొనడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన ‘కేంద్రాలకు వెళ్లడమే పెద్ద పరీక్ష’ కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల పరిధిలో పాఠశాలల పేర్లు, సెంటర్‌ కోడ్‌ స్పష్టంగా తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఎంఈవో, డీవైఈవోలతో పాటు పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, శాఖాధికారులను ఆదేశించారు.

హాల్‌ టికెట్‌లో ఉన్న విధంగా మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement