పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పలువురుని పలు పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
– వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన నల్లమోతు రామకృష్ణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా కొమ్మినేటి అనంతదుర్గాప్రసాద్‌లను నియమించారు. అదే విధంగా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులుగా దాసరి నరసింహారావు, వెల్నాటి జగన్మోహరావు, ప్రధాన కార్యదర్శులుగా నేసు రాఘవులు, నామా భాగ్యరాజు, కంభం పాటి గోపి, కార్యదర్శులుగా ఎం.అనంతయ్య, టి.అశోక్, ఎ.పృద్వీరావు, టి.శ్యామ్‌బాబు, కుల్లు పవన్‌కుమార్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌లుగా రాయపూడి యోహాను, శ్రీరామ్ మహేష్‌బాబు, కొమ్మాలపాటి బాలా, మందపాటి సాగర్‌బాబు, జి.శ్రీకాంత్, లాం అజయ్, పి.ఉత్సన్నలను నియమించారు. మేడికొండూరు మండలం యువజన విభాగం ఉపాధ్యక్షులుగా సయ్యద్ బషీర్, వి.సాంబశివరావు, ప్రధాన కార్యదర్శులుగా షేక్ సాజీద్, లేళ్ల కాశీరెడ్డి, దండా భరద్వాజ్‌రెడ్డి, కార్యదర్శులుగా దేవరకొండ సునీల్, నూతక్కి సుకుమార్, ఆయాజ్ బాషా, నార్నే శ్రీనివాసరావు, కొక్కిలికొండ శివశంకరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌లుగా సీహెచ్ రాజేష్, షేక్ పోలూరు లియాఖత్, పి.మోహాన్, పిల్లి బాలస్వామి, కె.రాము, ఎస్.విజయరాజు, పి.ప్రకాశ్‌రావు, తాడికొండ మండలం మైనారిటీ విభాగం ఉపాధ్యక్షులుగా షేక్ మెహాబూబ్ సుభాని, షేక్ కరీముల్లా, ప్రధాన కార్యదర్శులుగా షేక్ మెహాబూబ్ సుభాని, షేక్ అమీర్‌బాషా, షేక్ రబ్బాని, కార్యదర్శులుగా షేక్ సుభాని, షేక్ మెహాబూబ్, షేక్ జాన్‌సైదా, షేక్ ఆసీఫ్, షేక్ జాకీర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌లుగా షేక్ మహీబుతా, షేక్ గుజార్, షేక్ మెహాబూద్‌వలి, షేక్ షహజాన్, షేక్ కరీముద్దీన్, షేక్ జానీ, షేక్ ఇస్మాయిల్ జబీబుల్లాలను నియమించారు. ఫిరంగింపురం మండలం వలంటీర్స్ విభాగం ఉపాధ్యక్షులుగా వజ్రాల కోమలలత, దొడ్డా మల్లిఖార్జునరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా ఎం.కృష్ణకుమారి, షేక్ ఆదాంషఫీ, షేక్ గుంటూరు హబీబుల్లా, కార్యదర్శులుగా కూరగంటి ప్రేమ్‌కుమార్, తోక వెంకటేష్, భాణావత్ శివకాలేశ్వరనాయక్, పచ్చల సందీప్, రేపూడి కృష్ణమోహన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌లుగా మేళం రణదీప్, కూరపాటి హోసన్న, కె.శౌరీలు, పిల్లి షాలేమ్‌రాజు, గేరా వెంకటకోటేశ్వరావులను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో ల్యాండ్ ఫూలింగ్ రెండో దశకు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చర్చా వేదిక ప్రతినిధి సలీం మాలిక్, సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సెస్ విశ్రాంత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు జొన్నా శివశంకర్, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్, అండర్–23 యువకుల క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 9న తేదీ ఉదయం 07.30 గంటలకు అరండల్‌పేట 10/3 శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని యు.మహతి శంకర్ గురువారం ఒక ప్రటకటనలో పేర్కొన్నారు. అండర్–23 బాలురు 01–09–2003 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. సీనియర్ జట్టుకు వయస్సు పరిమితి లేదన్నారు. ప్లేయర్స్ వైట్ డ్రెస్‌తోపాటు సొంత కిట్ బ్యాగ్‌తో రిపోర్ట్ చేయాలన్నారు. డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీతో రిపోర్ట్ తప్పనిసరన్నారు.
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేట పరిసర ప్రాంతాల నుంచి క్రాంతి, హతీబ్ అనే వ్యక్తులు రేషన్ బియ్యం సేకరించి తరలిస్తుండగా, గురువారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేశారు. ఆటోలో తరలిస్తున్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న ఇరువురితోపాటు, డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసి బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


