జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను తొలుత సంబందిత అధికారులు పూర్తిగా పరిశీలించాలని పేర్కొన్నారు. పరిష్కార చర్యలకు నిర్దేశిత సమయాన్ని తెలియజేయాలన్నారు. పరిష్కారం కాని సమస్యల గురించి అర్జీదారులకు వివరించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి చర్యలు తీసుకొని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం 350 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.


