నేటి నుంచి అలంకారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అలంకారోత్సవాలు

Mar 6 2026 9:05 AM | Updated on Mar 6 2026 9:05 AM

మంగళగిరి టౌన్‌: మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి మార్చి 18వ తేదీ వరకు స్వామి వారి ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేవస్థానం ఆస్థాన మండపంపై ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయని అన్నారు. శుక్రవారం స్వామి వారి మత్స్యవతారం అలంకారంతో ఆస్థాన అలంకారోత్సవాలు ప్రారంభమ

వుతాయని, 7న వటపత్రసాయి, 8న రుక్మిణి హరణం, 9న గోవర్ధనోద్ధరణ, 10న గజేంద్ర మోక్షం, 11న పార్థసారథి, 12న శ్రీరంగనాయకులు, 13న రుక్మిణి కల్యాణం, 14న కాళీయ మర్ధనం, 15న స్థంభోద్భవం, 16న పరమపదనాథుడు, 17న శ్రీరామ పట్టాభిషేకం, 18 తేదీ సాయంత్రం కోదండరాముడు అలంకారోత్సవాలు జరుగుతాయని, 19వ తేదీన ఉగాది తిరువంజనోత్సవం, పంచాంగ శ్రవణం జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement