అర్జీలపై పూర్తి అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై పూర్తి అవగాహన ఉండాలి

Mar 10 2026 12:45 PM | Updated on Mar 10 2026 12:45 PM

అర్జీలపై పూర్తి అవగాహన ఉండాలి

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్‌.ఎస్‌)లో వచ్చే ప్రతి అర్జీపైనా ఆయా శాఖాధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండా లని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ మాట్లాడుతూ కొన్ని అర్జీలు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 514 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో షేక్‌ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్‌ గంగరాజు, డీపీఓ నాగసాయికుమార్‌, డీఆర్‌డీఏ పీడీ టి.విజయలక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ పరిశీలించారు.

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement