పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో ఏసీఎం విద్యార్థి విభాగం అధ్వర్యంలో మార్చి 14,15 తేదిల్లో జాతీయస్థాయి హాకథాన్ ఉద్గమ 1.0 నిర్వహించనున్నట్లు వర్సిటీ ప్రో–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూ నందు సోమవారం హ్యాకథాన్ ఉద్గమ 1.0 పోస్టర్లను అధ్యాపకులు, విద్యార్థులతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రో చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ యువ ఆవిష్కర్తలు బృందాలుగా ఏర్పడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతపై ఆలోచనలు పంచుకుని నిజజీవిత సమస్యలకు వినూత్న పరిష్కారాలు రూపొందించడం ఈ హ్యకథాన్ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రొటోటైప్‌లను, ప్రాజెక్ట్‌లను న్యాయనిర్ణేతలు, పరిశ్రమ నిపుణుల ముందు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ హ్యాకథాన్ పోటీల్లో పాల్గొనదలచిన సాంకేతిక విద్యార్థులు ఏసీఎం. వీవీఐటీగుంటూరు.కామ్ వైబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ ఆళ్ళ కళావతి, హ్యాకథాన్ సమన్వయకర్త డాక్టర్ బి.సాయిజ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు.


