మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత మా స్థలం ఆక్రమించారు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత మా స్థలం ఆక్రమించారు

Mar 10 2026 12:46 PM | Updated on Mar 10 2026 12:46 PM

మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత మా స్థలం ఆక్రమించారు

పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు 112 అర్జీలు స్వీకరించిన ఎస్పీ వకుల్‌ జిందాల్‌

కన్నకొడుకే చంపాలని చూస్తున్నాడు..

నగరంపాలెం: మాజీ ఎమ్మెల్యే, జనసేన నేతపై బాధితులు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తామన్నారు. నిర్ణీత వేళల్లో చట్టపరంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితుల సమస్యలపై వెంటనే సంబంధిత పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్‌), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్‌), అబ్దుల్‌అజీజ్‌ (గుంటూరు తూర్పు)లు కొన్ని అర్జీలు స్వీకరించారు. మొత్తం 112 ఫిర్యాదులు వచ్చినట్లు డీపీఓ వర్గాలు తెలిపాయి.

పదేళ్ల క్రితం నాల్గవ తరగతి ఉద్యోగిగా రిటైరయ్యాను. ఇటీవల నా కుమారుడు మా ఆస్తి విక్రయించి డబ్బులు ఇవ్వలేదు. దీనికితోడు సరిగా చూడటంలేదు. ఈమధ్య నా గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. మిగతా స్థలాన్ని నా సొంతంగా విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.

– బాలరాజు, కృష్ణబాబుకాలనీ,

గుంటూరు

Advertisement
 
Advertisement
Advertisement