బంగారం దుకాణాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బంగారం దుకాణాల్లో తనిఖీలు

Mar 10 2026 12:46 PM | Updated on Mar 10 2026 12:46 PM

బంగారం దుకాణాల్లో తనిఖీలు హైడ్రా క్రేన్‌ ఢీకొని వ్యక్తి మృతి మంగళగిరి టౌన్‌ : హైడ్రా క్రేన్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళగిరిలో సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మధుసూదనరావు (51) తాపీ పనిచేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లే క్రమంలో ఆత్మకూరు వద్ద సర్వీస్‌రోడ్‌లో విద్యాభవన్‌ వద్దకు చేరుకునే సరికి వెనుక నుంచి హైడ్రా క్రేన్‌ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మంగళగిరి రూరల్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్‌ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రేన్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): గుంటూరు నగరం లాలాపేటలోని బంగారం దుకాణాలలో సోమవారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెంట్స్‌ (బీఐఎస్‌) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాలాపేటలోని సన గోల్డ్‌ టెస్టింగ్‌ దుకాణంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆభరణాల టెస్టింగ్‌ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్‌మార్క్‌ను బంగారు ఆభరణాలపై మిషన్‌ ద్వారా ముద్రిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. బీఐఎస్‌ అధికారి వివేక్‌రెడ్డి మాట్లాడుతూ సన గోల్డ్‌ టెస్టింగ్‌ సెంటర్‌లో లైసెన్సులు లేకుండా హాల్‌మార్క్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. షాపులో హాల్‌ మార్క్‌ వేసిన నాలుగు ఉంగరాలు, మరికొన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లేజర్‌ మిషన్‌, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మీడియాపై దాడి...

బీఐఎస్‌ అధికారులు సన గోల్డ్‌టెస్టింగ్‌ దుకాణంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై షాపు నిర్వాహకులు దాడి చేశారు. మాషాపులోకి ఎలా వస్తారంటూ దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement