స్థలం ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు | - | Sakshi
Sakshi News home page

స్థలం ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు

Mar 10 2026 12:46 PM | Updated on Mar 10 2026 12:46 PM

స్థలం ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు

నా భర్త విశ్రాంత ఉప తహసీల్దార్‌. రెండేళ్ల క్రితం ఆయన మృతిందారు. 1980లో నా భర్త, మరో ఇద్దరితో కలిసి చుట్టుగుంట సమీపాన ఎకరం 23 సెంట్ల భూమి కొనుగోలు చేశారు. అందులో 1,548 గజాల స్థలంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత, అతని బంధువులతో కలిసి ఫేక్‌ డాక్యుమెంట్లు స్పష్టించారు. తద్వారా 1,548 గజాల స్థలంలో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ అక్రమ నిర్మాణంపై గతేడాది మే నెలలో అప్పటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. దీంతో నిర్మాణ పనులను అర్ధాంతంగా నిలిపివేశారు. కాలక్రమేణా మళ్లీ నిర్మాణ పనులు కొనసాగించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత గుంటూరు జీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, స్థలం తనదంటూ డాక్యుమెంట్స్‌ చూపించారు. అయితే ఆ పత్రాలు సరైనవికాదని జీఎంసీ అధికారులు తేల్చారు. ఇటీవల స్థలంతో సంబంధంలేదని, వేరే వ్యక్తికి చెందినదని సదరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత తెలియజేశారని అన్నారు. అయితే ఆ వ్యక్తి మాజీ ఎమ్మెల్యేకు స్వయానా బంధువు. ఈ ఆక్రమణ వెనుక మాజీ ఎమ్మెల్యే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన మాపై దౌర్జన్యాలకు పాల్పడటం, చంపుతామని బెదిరిస్తున్నారు. మా ఆస్తిని మాకు దక్కకుండా మాజీ ఎమ్మెల్యే, బంధువులు, అనుచరులు అడ్డు కుంటున్నారు. మా ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని కోరుతున్నాం.

– జి.భారతి, శారదాకాలనీ 30వ లైను,

గుంటూరు

Advertisement
 
Advertisement
Advertisement