గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 4 2026 7:44 AM | Updated on Mar 4 2026 7:44 AM

ఇఫ్తార్‌ సహరి (బుధ) (గురు) నరసరావుపేట 6.23 5.09 గుంటూరు 6.21 5.07 బాపట్ల 6.21 5.07

న్యూస్‌రీల్‌

అత్యంత హేయం

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ అంగన్‌వాడీ మహిళలు

సత్తెనపల్లిలో నిరసన ర్యాలీ

నిమ్మకాయల ధరలు

భక్త బృందం ప్రదర్శన

బోల్తాకొట్టిన జేసీబీ

బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026
అంగన్‌వాడీలపై
ఇఫ్తార్‌ సహరి (బుధ) (గురు) నరసరావుపేట 6.23 5.09 గుంటూరు 6.21 5.07 బాపట్ల 6.21 5.07

7

సత్తెనపల్లి: అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై అరెస్టులా? ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగటం అన్యాయమా? అని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌ నుంచి 29 మంది అంగన్‌వాడీలను విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేసి సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆ 29 మంది అంగన్‌వాడీ మహిళల్లో ఉన్న అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బ రావమ్మలు మీడియాతో మాట్లాడారు.

● సోమవారం విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందన్నారు. దీంతో అంగన్‌వాడీలు తమ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారన్నారు. రాత్రి కూడా ధర్నా చౌక్‌ వద్ద అంగన్‌వాడీ మహిళలు అధిక సంఖ్యలో పట్టు వదలకుండా అక్కడే ఉండిపోయారన్నారు. అక్కడే నిద్రించారన్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఐసీడీఎస్‌ జేడీ ధర్నా వద్దకు వచ్చి మీరు వెంటనే టెంట్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారన్నారు. దీంతో తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వచ్చి హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, పోరాటం విరమించేది లేదని తేల్చి చెప్పామన్నారు.

● ఆ రాత్రి అక్కడే అంగన్‌వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు సుమారు 500 మంది పోలీసులు మూకుమ్మడిగా వచ్చి సైడ్‌ వాల్‌ క్లాత్‌తో నిద్రిస్తున్న తమను చుట్టుముట్టి దాడి చేశారన్నారు. కరెంటు తీసివేశారన్నారు. ఆ చీకట్లో అంగన్‌వాడీల బ్యాగులు ఎక్కడున్నాయో! కళ్లజోళ్లు ఎక్కడున్నాయో! సెల్‌ఫోన్‌లు ఎక్కడున్నాయో! చెప్ప్పులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఈ దాడిలో తనకు ఎడమ చేయి విరిగిందని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి వాపోయారు. ఒక్కొక్కరిని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్‌లో ఎక్కించారన్నారు. ఎవరెవరిని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని, 29 మంది అంగన్‌వాడీలతో ఉన్న మా వ్యాను ముందుగా గుంటూరు తీసుకువచ్చారన్నారు. ఆ తరువాత నరసరావుపేట తీసుకువెళ్లి అక్కడి నుంచి సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చారన్నారు.

టాయిటెట్స్‌కూ

అనుమతించలేదు...

సత్తెనపల్లి వచ్చే వరకు ఈ మధ్యలో టాయిలెట్స్‌కు వెళ్లాలన్నా పోలీసులు అనుమతించలేదన్నారు. మేం చేసిన తప్పేమిటి? అరకొర వేతనాలతో, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరామే తప్ప ఆస్తులు ఇవ్వాలని, పదవులు మాకు ఇవ్వాలని మేం కోరామా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా అప్పుడు రాతపూర్వకంగా ఇచ్చిన మినిట్స్‌ కాపీలో హామీలను అమలు చేయాలని కోరామని వారు తెలిపారు.

పోలీసుల దాడిలో చెయ్యి విరిగి ఇబ్బంది పడుతున్న అంగన్‌వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి

రథంపై నృసింహుడు

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.9,700, మోడల్‌ ధర రూ.9,000 వరకు పలికింది.

మాచర్ల: రాధాకృష్ణ భక్త బృందం సభ్యులు మంగళవారం మాచర్లలో ఆధ్యాత్మిక ప్రదర్శన నిర్వహించారు. భగవద్గీత శ్లోకాలు వినిపిస్తూ పర్యటించారు.

తాడేపల్లి రూరల్‌ : మంగళగిరి రూరల్‌ పరిధిలోని ఆత్మకూరు అండర్‌పాస్‌ వద్ద మంగళవారం జేసీబీ అదుపుతప్పి డ్రైన్‌లో బోల్తాపడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిద్రిస్తున్న

అంగన్‌వాడీలపై తెల్లవారుజామున

దాడులు

అంగన్‌వాడీ వర్కర్స్‌ నాయకురాలిచెయ్యి

విరగ్గొట్టిన విజయవాడ పోలీసులు

మహిళా దినోత్సవం సందర్భంగా

అంగన్‌వాడీలకు కూటమి ప్రభుత్వం

ఇచ్చిన గిఫ్ట్‌ ఇది..

సమస్యలు పరిష్కరించకుంటే కూటమి

ప్రభుత్వానికి రిటర్న్‌ గిఫ్ట్‌ కూడా ఇస్తాం

అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌

రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి,

సుబ్బరావమ్మ

అరెస్టు చేసి విజయవాడ ధర్నా చౌక్‌

నుంచి సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌కు

29 మందిని తరలించిన పోలీసులు

సత్తెనపల్లి పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి అంగన్‌వాడీలను విడుదల చేస్తున్నామని, ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపొమ్మని చెప్పారు. అయితే అంగన్‌వాడీలు తమను ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడకు విజయవాడ తీసుకువెళ్లి వదిలి పెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనికి సీఐ నాగమల్లేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి తాలూకా సెంటర్‌ వరకు భారీ నిరసన ప్రదర్శన చేశారు.

చిలకలూరిపేట: విజయవాడ ధర్నా చౌక్‌లో తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లలో సుమారు 30 మంది వివిధ జిల్లాలకు చెందిన వారిని మంగళవారం చిలకలూరిపేట అర్బన్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు, స్థానిక అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు వారికి సంఘీభావంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ వారిని పరామర్శించి, సంఘీభావం తెలిపారు. కర్నూలు, తూర్పు గోదావరి, పోలవరం, కోనసీమ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 30 మంది అంగన్‌వాడీలను విజయవాడ దీక్షా శిబిరంలో తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. తెల్లవారుజామున మహిళలను అదుపులోకి తీసుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలు కాలకృత్యాలు తీర్చుకొనే అవకాశం లేకుండా ఇబ్బందులకు గురి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement