మంగళగిరి టౌన్ : మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం గజేంద్ర మోక్షం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యల పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో సునీల్‌కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శేషగిరిరావు, కల్యాణిలు వ్యవహరించగా, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన తాడికొండ తిరుమలరావు, తాడికొండ సాయికుమార్‌లు వ్యవహరించారు.
నేడు పార్థసారథి .....
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.


