ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు తప్పవని ఐదో అదనపు సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) కె.లత అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ సాయికళ్యాణ్‌చక్రవర్తి ఆదేశాల మేరకు శుక్రవారం నగరంపాలెం పోలీస్‌ కల్యాణ మండపంలో ట్రాఫిక్‌ రూల్స్‌పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె.లత మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తారని తెలిపారు. లైసెన్‌న్స్‌లు, బీమా లేకున్నా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా నేరాలుగా పరిగణిస్తారని అన్నారు. లైసెన్స్‌ లేనివారికి వాహనాలు అప్పగించడం నేరమని స్పష్టం చేశారు. మోటారు వాహనాల చట్టంలోని నేరాలు, శిక్షలు, మద్యం/ డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలను వివరించారు. సదస్సులో ఏపీపీ అల్లంశెట్టి పవన్‌ కుమార్‌, గుంటూరు పశ్చిమ ట్రాఫిక్‌ పీఎస్‌ సీఐ సింగయ్య పాల్గొన్నారు.

అదనపు సివిల్‌ జడ్జి

(జూనియర్‌ డివిజన్‌) కె.లత

Advertisement
 
Advertisement
Advertisement