14న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

14న జాతీయ లోక్‌ అదాలత్‌

Mar 6 2026 9:05 AM | Updated on Mar 6 2026 9:05 AM

గుంటూరు లీగల్‌: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో ఈనెల 14న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్‌ చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బెంచ్‌ల ద్వారా సివిల్‌ కేసులు (పార్టిషన్‌ సూట్స్‌, మనీ మేటర్స్‌, పర్మినెంట్‌ ఇంజక్షన్స్‌ సూట్స్‌, స్పెసిఫిక్‌ పెర్ఫార్మన్స్‌), రాజీ పడదగ్గ క్రిమినల్‌ కేసులు, ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇచ్చిన సర్క్యూలర్‌ ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ ఎకై ్సజ్‌ కేసులు, మోటార్‌ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, ఎల్‌ఏఓపీ కేసులు, ప్రీ–లిటిగేషన్‌ కేసులు పరిష్కరించటం జరుగుతుందన్నారు. కక్షిదారులు, పోలీస్‌ శాఖ, స్టేక్‌ హోల్డర్స్‌ అందరూ జాతీయ లోక్‌ అదాలత్‌లకు హాజరై ఎక్కువ కేసులు పరిష్కరించేలా సహకరించాలన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో సివిల్‌ కేసులలో అప్పీల్‌ కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా కక్షిదారులకు, న్యాయవాదులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement