డ్యామెక్కిన హామీ | - | Sakshi
Sakshi News home page

డ్యామెక్కిన హామీ

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

డ్యామ

డ్యామెక్కిన హామీ

డ్యామెక్కిన హామీ ఇఫ్తార్‌ సహరి (శని) (ఆది) గుంటూరు 6.20 5.09 నరసరావుపేట 6.22 5.11 బాపట్ల 6.20 5.09 శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిమ్మకాయల ధరలు

సాగర్‌ నీటిమట్టం వివరాలు

సామూహిక కుంకుమార్చన

తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రం కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్‌ డ్యామ్‌ను నిర్మించి ఆ ప్రాంత వాసుల తాగు, సాగునీటి ఇక్కట్లను తీరుస్తామని జనసేన పార్టీ అధినేత వన్‌కళ్యాణ్‌ హామీనిచ్చారు. 2024 ఏప్రిల్‌ 14న తెనాలి మార్కెట్‌ సెంటర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో అప్పుడు గుంటూరు ఎంపీగా పోటీచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌, తెనాలి ఎమ్మెల్యే బరిలో నిలిచిన నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో పవన్‌కళ్యాణ్‌ నియోజకవర్గ ప్రజలకు ఈ హామీనిచ్చారు. ఎన్నికల్లో గెలిపించిన వెంటనే చెక్‌డ్యామ్‌ నిర్మిస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ హామీతో కొల్లిపర మండల వాసులు కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు చేశారు.

ఎన్నికల్లో మనోహర్‌కు భారీ మెజారిటీ లభించింది. అధికారంలోకి వచ్చాక పవన్‌కళ్యాణ్‌ డెప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రచేఖర్‌ కేంద్ర సహాయమంత్రిగా, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

‘అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా కృష్ణానదిని ఆనుకుని ఉన్న మండల కేంద్రం కొల్లిపరకు నీటి కష్టాలు వెన్నాడుతున్నాయి. భూగర్భజలాలు తగ్గిపోయి, నదికి వంద మీటర్ల దూరంలోని పంటపొలాలకూ నీరందటం లేదు. మోటార్లతో తోడుకోవాల్సిన అగత్యం వచ్చింది.

కొల్లిపరలో ఆరిమండ శివకుమారి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు 2022లో వాటర్‌ ప్లాంట్‌ నిర్మించారు. తాగునీరు అవసరమైనవారు క్యాన్లలో ఉచితంగా తీసుకెళ్లే సదుపాయం కల్పించారు.

నీటి సంగతిలా ఉంటే నదీగర్భలోని లంక గ్రామాలకు వెళ్లటానికి రైతులు, రైతుకూలీలు నానా అవస్థలు పడుతుంటారు.

కొల్లిపర మండల వాసులకు నదికి అవతల వైపున గల కృష్ణాజిల్లా గ్రామాలతో బంధుత్వాలున్నాయి. ఇక్కడివారు కృష్ణాజిల్లాకు వెళ్లాలంటే మూడు నీటి పాయలు దాటి వెళ్లాల్సి వస్తోంది. కృష్ణానది నిండుగా ఉండి, పడవ ప్రయాణం సాధ్యం కానపుడు విజయవాడ మీదుగా 70 కి.మీ. ప్రయాణించాల్సి వస్తుంది.

కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్‌డ్యామ్‌ను నిర్మిస్తే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. భూగర్భజలాలు పెరిగి సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోతాయి. పంట ఉత్పత్తుల రవాణాకు రైతులు, రైతుకూలీలకు సులువైన మార్గం ఏర్పడుతుంది. దాదాపు 65 కిలోమీటర్ల ప్రయాణ భారం తగ్గిపోతుంది.

ఇంతటి కీలక అంశంపై తాను ఇచ్చిన హామీపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌ పట్టించుకోవటం లేదు. ఆ హామీపై మెజారిటీని దక్కించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడటం లేదు.

సూపర్‌సిక్స్‌ హామీల్లానే చెక్‌డ్యామ్‌ నీటిపై రాతలా కనిపించదేమోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు.

గుంటూరు
ఇఫ్తార్‌ సహరి (శని) (ఆది) గుంటూరు 6.20 5.09 నరసరావుపేట 6.22 5.11 బాపట్ల 6.20 5.09

ఎన్నికల్లో గెలుపు కోసం సూపర్‌ సిక్స్‌ హామీల తరహాలోనే కూటమి నేతలు నియోజకవర్గాల్లోనూ స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు వాగ్దానాలు చేశారు. అందులో కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్‌డ్యామ్‌ నిర్మాణం ఒకటి. అధికారంలోకి వచ్చి ఇరవై నెలలవుతోంది. కూటమి నాయకులు కీలకమైన ఆ హామీ ఊసే ఎత్తటం లేదు. నియోజకవర్గం నుంచి కేంద్రం, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులున్నా చెక్‌డ్యామ్‌ గురించి మాట్లాడితే ఒట్టు...అన్నట్టు ఉన్నారు. – తెనాలి

7

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.10,000, మోడల్‌ ధర రూ.9,000 వరకు పలికింది.

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 539.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

తెనాలి: స్థానిక బాలాజీరావు పేటలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో

పవన్‌ కళ్యాణ్‌ హామీలు

గెలిచిన వెంటనే కొల్లిపర వద్ద

కృష్ణానదిపై చెక్‌డ్యామ్‌

నిర్మిస్తామంటూ

నాడు వాగ్దానం

ఇరవై నెలలవుతున్నా

పట్టించుకోకుండా మౌనం

డ్యామెక్కిన హామీ1
1/7

డ్యామెక్కిన హామీ

డ్యామెక్కిన హామీ2
2/7

డ్యామెక్కిన హామీ

డ్యామెక్కిన హామీ3
3/7

డ్యామెక్కిన హామీ

డ్యామెక్కిన హామీ4
4/7

డ్యామెక్కిన హామీ

డ్యామెక్కిన హామీ5
5/7

డ్యామెక్కిన హామీ

డ్యామెక్కిన హామీ6
6/7

డ్యామెక్కిన హామీ

డ్యామెక్కిన హామీ7
7/7

డ్యామెక్కిన హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement