గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు

Mar 8 2026 7:50 AM | Updated on Mar 8 2026 7:50 AM

గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు ● జిల్లా ఎస్పీ శ్రీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ గత నాలుగు నెలల్లో గుంటూరు జిల్లాలో సుమారు 250 మందిని గంజాయి వినియోగం, విక్రయం రవాణా కేసుల్లో అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 8 మందిపై పీడీ యాక్ట్‌ అమలు చేసినట్లు వెల్లడించారు. కార్డన్‌ సెర్చ్‌ లో 350 ఇళ్లను తనిఖీ చేసి 79 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. ఈగల్‌ ఎస్పీ కె.నగేష్‌ బాబు మాట్లాడుతూ గంజాయి ఇతర డ్రగ్స్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుంటూరు సౌత్‌ సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ మధుసూదనరావు, నల్లపాడు సీఐ వంశీధర్‌, ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, వట్టిచెరుకూరు సీఐ రామా నాయక్‌, ఇతర ఎస్‌ఐలు సుమారు 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరు రూరల్‌: గుంటూరు నగరంలోని స్వర్ణభారతినగర్‌ ఇద్వానగర్‌ కాలనీలో శనివారం కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ ఈగల్‌ చీఫ్‌ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ప్రజల భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ వజ్రప్రహార్‌ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెగా కార్డన్‌ డేగా ప్రకటించి ఒకేసారి విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో గంజాయి విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఏపీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ – 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఏపీ ఈగల్‌ చీఫ్‌ ఆకె రవికృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement