కేఎల్‌యూలో ప్రారంభమైన ‘సురభి’ | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌యూలో ప్రారంభమైన ‘సురభి’

Mar 7 2026 8:17 AM | Updated on Mar 7 2026 8:17 AM

తాడేపల్లి రూరల్‌ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్శిటీలో శుక్రవారం సురభి – 2026 యువజన సాంస్కృతికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను వర్శిటీ వీసీ డాక్టర్‌ జి. పార్థసారథి వర్మ ప్రారంభించి మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయా యూనివర్శిటీలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 15 వేల మంది పాల్గొంటున్నారని తెలిపారు. వర్శిటీ ప్రధాన కార్యదర్శి కోనేరు శివకాంచనలత మాట్లాడుతూ తొలిరోజు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో చదువు, క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎఎస్‌ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, ఉత్తమ అధ్యాపకులకు అవార్డులను ప్రదానం చేశారు. తొలి రోజు కార్యక్రమంలో వర్శిటీ ప్రధాన కార్యదర్శి కోనేరు నిఖిల, ప్రోచాన్సలర్లు డాక్టర్‌ కె.ఎస్‌. జగన్నాథరావు, డాక్టర్‌ ఏవీఎస్‌ ప్రసాద్‌, డాక్టర్‌ కె.రాజశేఖరరావు, డాక్టర్‌ ఎన్‌.వెంకటరామ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, సురభి 2026 చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కేఆర్‌ఎస్‌ ప్రసాద్‌, కన్వీనర్‌ సాయి విజయ్‌, వివిధ విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement