లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ వద్ద 9వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, రైతు సంఘం నాయకులు శివసాంబిరెడ్డి, వి.భారతి,బి. శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రామరృష్ణ, జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి.కోటేశ్వరి ,సిఐటియు జిల్లా నాయకులు వై. నేతాజీ, కె. నళినీకాంత్, ఎన్.భావనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య


