13, 14 తేదీల్లో కిట్స్‌ అక్షర్‌లో ‘గాల–2026’ | - | Sakshi
Sakshi News home page

13, 14 తేదీల్లో కిట్స్‌ అక్షర్‌లో ‘గాల–2026’

Mar 4 2026 7:45 AM | Updated on Mar 4 2026 7:45 AM

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం యనమదల కిట్స్‌ అక్షర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 13, 14 తేదీల్లో ‘గాల 2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కోయి సుబ్బారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను మంగళవారం స్థానిక కళాశాలలో చైర్మన్‌ సుబ్బారావు, సెక్రటరీ కోయి శేఖర్‌, డైరెక్టర్‌ గోగినేని సాంబశివరావులతో కలిసి ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభ ప్రతిబింబించేలా టెక్నికల్‌ ఈవెంట్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నామని చెప్పారు. బ్రోచర్‌లో కార్యక్రమాల పూర్తి షెడ్యూల్‌తో పాటు ఈవెంట్‌ వివరాలు, నమోదు విధానం, బహుమతుల సమాచారం ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈవెంట్‌లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలవాలని చైర్మన్‌ ఆకాంక్షించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. రామకోటయ్య, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కోయి సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement