ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Mar 4 2026 7:45 AM | Updated on Mar 4 2026 7:45 AM

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి ● ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కెఎస్‌కె ఫరీఫా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు రానున్న రెండు సంవత్సరాలలో టెట్‌ ఉత్తీర్ణత సాధించలేకపోతే ప్రమోషన్‌ ఉండదు.. సర్వీస్‌ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే తీర్పు రావటానికి కారణమైన విద్యాహక్కు చట్టాన్ని సవరించాలన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పడిన కాలనీలలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరారు. ● జిల్లా ప్రధాన కార్యదర్శి బాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, డిఎస్సీ– 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింప చేయాలని, 12వ పీఆర్‌సీ కమిషన్‌ నియమించి 30 మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ● రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్‌ కరిముల్లా మాట్లాడుతూ, యాప్‌ల భారం తగ్గించాలనీ, మున్సిపల్‌ ఉపాధ్యాయులకు పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ నేతలు కృష్ణారావు, ఇబ్రహీం, దమ్మాటి శ్రీనివాసరావు, ప్రజామూర్తి తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి టెట్‌ ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. టెట్‌ విధానం రాకముందు ఎంపికై న ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. టెట్‌ నిబంధన తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈమేరకు ఛలో ఢిల్లీ వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు.

8న టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు

నరసరావుపేట ఈస్ట్‌: సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో ఈనెల 8వ తేదీన శాప్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. పోటీల్లో భాగంగా 40 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు టెన్నిస్‌, 35 సంవత్సరాలు వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు బ్యాడ్మింటన్‌ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆయా క్రీడల్లో సింగిల్‌, డబుల్స్‌, మిక్సడ్‌ డబుల్‌ విభాగాలలో నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్‌ వెబ్‌సైట్‌లో తమ ఆధార్‌ కార్డు ద్వారా రిజిస్టర్‌ కావాలని తెలిపారు. రిజిస్టర్‌ అయిన క్రీడాకారులను మాత్రమే పోటీలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు 8712622574 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement