నృసింహునికి పట్టువస్త్రాలు సమర్పణ | - | Sakshi
Sakshi News home page

నృసింహునికి పట్టువస్త్రాలు సమర్పణ

Mar 9 2026 7:30 AM | Updated on Mar 9 2026 7:30 AM

నృసింహునికి పట్టువస్త్రాలు సమర్పణ

మంగళగిరి టౌన్‌: మంగళగిరిలో వేంచేసి ఉన్న లక్ష్మీనరసింహస్వామికి పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. చీర, సారె, పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలు, పలు రకాల పండ్లు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషిస్వామి దేవస్థానం నుంచి 96 పళ్లెములతో పూజా ద్రవ్యాలు, మంగళవాయిద్యాలతో పురవీధుల్లో ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకున్నారు. సంఘ అధ్యక్షులు ఊట్ల పాలశ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement