గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 9 2026 7:30 AM | Updated on Mar 9 2026 7:30 AM

సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026 భక్తి గుడారం.. స్తుతి నైవేద్యం అట్టహాసంగా ముగిసిన 49వ గుడారాల పండుగ పశ్చిమ డెల్టాకు నీటి విడుదల ఇఫ్తార్‌ సహరి (సోమ) (మంగళ) గుంటూరు 6.22 5.04 నరసరావుపేట 6.24 5.06 బాపట్ల 6.22 5.04

న్యూస్‌రీల్‌

చివరి రోజు దాదాపు 20 లక్షల మందితో కిక్కిరిసిన దయాక్షేత్రం ముగింపు ప్రార్థనలు చేసిన పాస్టర్స్‌ జాన్‌వెస్లీ, అబ్రహాం ప్రేమ కురిపించ డమే క్రీస్తుతత్వమని ఉద్బోధ సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పిన పాస్టర్స్‌

సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026
భక్తి గుడారం.. స్తుతి నైవేద్యం
అట్టహాసంగా ముగిసిన 49వ గుడారాల పండుగ

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 1,316 క్యూసెక్కులు వదిలినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కొమ్మూరు కాలువకు 733 క్యూసెక్కులు వదిలారు.

అమరావతి: మంచి గంధం చెక్కకు ఎన్ని కోతలు చేస్తే, అంత సుగంధం వెదజల్లినట్లు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్రైస్తవ్యంలో ఉన్న కీస్తు విశ్వాసులు ప్రపంచాన్ని, దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటారని హోసన్నా మినిస్ట్రీస్‌ అధ్యక్షుడు పాస్టర్‌ అబ్రహాం అన్నారు. అమరావతి మండలం లేమల్లె గ్రామంలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్‌ నిర్వహించే 49వ గుడారాల పండుగ చివరి రోజైన ఆదివారం పగటి పూట ముగింపు ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గుడారాల పండుగలో దేవుడిని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట దేవుడు నడిచి వారిపై తన ఆశీర్వాదాలను విస్తారంగా కురిపిస్తాడన్నారు. నాలుగు రోజులపాటు చేసిన ప్రార్థనలకు అనుగుణంగా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని తోడు మనతో ఉండాలన్నారు. పోగొట్టుకున్న వాటిన్నింటినీ దేవుని ఆశీర్వాదంతో రెట్టింపుగా పొందుతామన్నారు.

అందరికీ కృతజ్ఞతలు..

ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులు పూర్తిస్థాయిలో వసతులు కల్పించడంలో సహకరించిన వారందరికీ పాస్టర్‌ అబ్రహాం కృతజ్ఞతలు తెలిపారు. తొలి ఏడాది అనుభవాలతో ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది 50వ గుడారాల పండుగ మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ గుడారాల పండుగ ఎంతో ఘనంగా జరగటానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బంది ప్రతి ఒక్కరికి హోసన్నా మినిస్ట్రీస్‌ తరఫున కృతజ్ఞతలు తెలుతున్నామని పేర్కొన్నారు.

నిరంతర స్తుతి అవసరం..

తొలుత చివరి రోజు సభలకు పాస్టర్‌ జేమ్స్‌ ప్రారంభ ప్రార్థన నిర్వహించారు. అనంతరం హోసన్నా మినిస్ట్రీస్‌ చీఫ్‌ పాస్టర్‌ జాన్‌వెస్లీ ప్రసంగిస్తూ ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండియున్నదని తెలిపారు. మానవుడు దేవుడిని ఎంతగా ప్రార్థిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వాదాలు ఇస్తాడన్నారు. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఆయన కృప ఉన్నప్పటికీ ఎవరైతే స్తుతిస్తూ తమ హృదయాలను బలిపీఠంగా చేస్తారో వారిపై ఆయన ప్రత్యేక కృప కనబరుస్తాడన్నారు. లోకమంత దేవుని కృపతో నిండియున్నప్పటికీ దానిని అందిపుచ్చుకోవటానికి ప్రతి ఒక్కరూ దేవుడిని నిరంతరం స్తుతించాలన్నారు. హోసన్నా మినిస్ట్రీస్‌ పాస్టర్ల బృందం స్తుతి గీతాలు ఆలపించింది. హోసన్నా మినిస్ట్రీస్‌ దైవ జనులు రమేష్‌, ఫ్రెడ్డీ పాల్‌ దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రార్థనలలో ఆదివారం కావటంతో దాదాపు 20 లక్షల మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న దైవజనులు చీఫ్‌ పాస్టర్‌ జాన్‌వెస్లీ, హోసన్నా మినిస్ట్రీస్‌ అధ్యక్షుడు అబ్రహాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement