మంగళగిరి టౌన్ : మంగళాద్రిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి ఆస్థాన అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో కోగంటి సునీల్‌కుమార్ ఉత్సవాన్ని పర్యవేక్షించారు. ఉత్సవానికి కై ంకర్యపరులుగా హైదరాబాద్‌కు చెందిన దూర్జటి మధుసూధనరావు, చెంచు వెంకట సుబ్బారావులు వ్యవహరించగా, ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన వెంకట శ్రీరామచంద్రశర్మ దంపతులు వ్యవహరించారు.


