అర్జీలు సత్వరం పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరం పరిష్కరించండి

Mar 3 2026 8:16 AM | Updated on Mar 3 2026 8:16 AM

అర్జీలు సత్వరం పరిష్కరించండి

భర్త వేధిస్తున్నాడు..

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీసు పీజీఆర్‌ఎస్‌లో 165 అర్జీలు

నగరంపాలెం: జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అర్జీలు వెల్లువెత్తాయి. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు ఆలకించారు. అర్జీలను పరిశీలించి, బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలంటూ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితుల నుంచి మొత్తం 165 ఫిర్యాదులను స్వీకరించారు. డీఎస్పీ అబ్దుల్‌అజీజ్‌ (గుంటూరు తూర్పు), బెల్లం శ్రీనివాస్‌ (ట్రాఫిక్‌), మధుసూదన్‌రావు (సీసీఎస్‌) లు కూడా అర్జీలు స్వీకరించారు.

నాలుగేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లయింది. భర్త ఓ వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించేవాడు. మా ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతను పట్టాభిపురంలో మరో మహిళతో ఉంటున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి నన్ను మరింతగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ ఇటీవల నోటీసులు పంపించాడు. అదేమని అడిగితే గొడవక’ు దిగి, దాడికి పాల్పడుతున్నాడు. చేత్తో కొట్టడం, చాకుతో బెదిరించడం చేస్తున్నాడు. ఇటీవల కుమార్తెను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇప్పటికై నా నా భర్తతో కలిసి కాపురం చేయాలని అనుకుంటున్నా. న్యాయం చేయగలరు.

– బాధిత మహిళ, చుట్టుగుంట, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement