సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు | - | Sakshi
Sakshi News home page

సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

సింహ

సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు

గ్రామోత్సవంలో భక్తులకు

దర్శనమిచ్చిన శ్రీవారు

ఉదయం చిన శేషవాహనంపై

విహరించిన నారసింహుడు

మంగళగిరి టౌన్‌ : మంగళాద్రిలో వేంచేసిన యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గ్రామోత్సంలో స్వామివారు సింహ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంలో కొలువుతీరిన బ్రహ్మాండ నాయకుడు నృసింహస్వామిని భక్తులు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. హింసించే స్వభావం గలవారిని హింసించేవాడు నారసింహుడు. నరుల్లో సింహం వంటి వాడు నరసింహ స్వరూపుడైన స్వామి సింహ వాహనోత్సవం తిలకించిన వారికి దుర్మార్గుల వల్ల కలిగే భయం తొలగుతుందని భక్తుల నమ్మకం. సాధు జనులకు అభయాన్నిస్తూ దుర్మార్గాన్ని పారద్రోలుటకు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పక్షుల్లో గరుత్మంతుడు, మృగాల్లో సింహం తానేనని స్వామివారు చెప్పినట్లు అర్చకులు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు వ్యవహరించారు.

ఉదయం చిన్నశేషవాహనంపై..

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కై ంకర్య పరులుగా దేవతి భగవన్నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.

నేడు హంస, గజ వాహన సేవలు

గ్రామోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి గజ వాహనంపై స్వామికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు.

సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు 1
1/2

సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు

సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు 2
2/2

సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు

Advertisement
 
Advertisement
Advertisement