పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ప్రతి పేదవాడు గర్వపడేలా.. విద్య, వైద్యం, న్యాయం మన హక్కు అని చాటి చెప్పేలా, యువ భావజాలంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ జెండాను మోదుగుల, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా, పేదల సంక్షేమమే ఽకోసం వైఎస్సార్‌సీపీ పుట్టిందన్నారు. దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్డర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చేలా వైఎస్ జగన్ దృష్టి సారిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ పదహారేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారే తప్ప.. ఏ రోజు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉందా.. ప్రతిపక్షంలో ఉందా అనేది చూసుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాంరసూల్, అనుబంధ విభాగాల నేతలు వంగల వలివీరారెడ్డి, పఠాన్ సైదాఖాన్, యర్రెడ్ల వెంకటేష్‌రెడ్డి, మారంరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతపల్లి వెంకటరమణ, రమణి, షరిఫుద్దీన్, కొత్తా చిన్నపరెడ్డి, నర్సిరెడ్డి, వెంకాయమ్మ, కోటి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి


