● సమీప బంధువు ఆస్తి రాయించుకున్నాడు ● కేసు వేసిన లాయరు 15 ఏళ్లయినా కేసు నంబరు చెప్పడు ● తిరిగి తిరిగి నా తల్లి చనిపోయింది ● కేసు నా పేరు మీద మారుస్తానని చెప్పి ఏడాదవుతోంది ● కానీ నాకు న్యాయం చేయడం లేదు | - | Sakshi
Sakshi News home page

● సమీప బంధువు ఆస్తి రాయించుకున్నాడు ● కేసు వేసిన లాయరు 15 ఏళ్లయినా కేసు నంబరు చెప్పడు ● తిరిగి తిరిగి నా తల్లి చనిపోయింది ● కేసు నా పేరు మీద మారుస్తానని చెప్పి ఏడాదవుతోంది ● కానీ నాకు న్యాయం చేయడం లేదు

Mar 7 2026 8:17 AM | Updated on Mar 7 2026 8:17 AM

● సమీప బంధువు ఆస్తి రాయించుకున్నాడు ● కేసు వేసిన లాయరు 15 ఏళ్లయినా కేసు నంబరు చెప్పడు ● తిరిగి తిరిగి నా తల్లి చనిపోయింది ● కేసు నా పేరు మీద మారుస్తానని చెప్పి ఏడాదవుతోంది ● కానీ నాకు న్యాయం చేయడం లేదు ● గుంటూరు జిల్లా తెనాలి పట్టణం అయితానగర్‌ పరిధిలోని ప్యాడిసన్‌ పేటకు చెందిన ఈమె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్టు కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమె తల్లి సంతోషమ్మకు ముగ్గురు కుమార్తెలు కాగా చివరి కుమార్తె కమలమ్మ. సంతోషమ్మ పెద్ద కుమార్తెను అత్తింటి వారు ఆదరించకపోతే సొంత డబ్బులు వెచ్చించి షెడ్డు కట్టించింది. ఆమె కొడుకును తెచ్చుకుని సంతోషమ్మ తెనాలిలో తన ఇంట్లో పెంచుకుంటూ పనిలో పెట్టింది. కాలక్రమంలో సంతోషమ్మను నమ్మించి ఆస్తి పేపర్లు కాజేసిన మనవడు కట్టుపల్లి సుమన్‌ తన పేరిట రాయించుకున్నాడు. దీనిపై సంతోషమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తానన్న లాయర్‌ రాజారత్నం 15 ఏళ్లు అయినా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. తల్లి సంతోషమ్మ, భర్తతో కలిసి లాయరు చెప్పిన రోజు కోర్టుకు వస్తే.. ‘కేసు ఫలానా తేదీకి వాయిదా వేశారు.. పదండని పంపేవాడు.. ఇప్పటివరకు కేసు నంబరు తెలియదు. జడ్జి దగ్గరకు తీసుకెళ్లిందీ లేదు. ఆస్తి కాజేసిన కట్టుపల్లి సుమన్‌, లాయర్‌ రాజారత్నం చేసిన మోసానికి మనస్తాపంతో నా తల్లి ఇదే రోజు చనిపోయింది. అందుకే నేను కూడా ఇదేరోజు కోర్టు వద్ద ప్రాణాలు తీసుకోవాలని పెట్రోలు పోసుకున్నా. అందరూ కలిసి ఆపారు’ అంటూ కమలమ్మ రోదిస్తూ చెప్పింది. తనకు న్యాయం చేయాలని అందరినీ అభ్యర్థించింది.

తెనాలి: స్థానిక కోర్టు ప్రాంగణం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో లాయర్లు, కక్షిదారులతో బిజీగా ఉంది. అక్కడ ఉన్న అరుగు మీద కూర్చున్న మండ్రు కమలమ్మ అనే మహిళ ఉన్నపళంగా వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి పెట్రోలు బాటిల్‌ తీసి తలపై పోసుకుంది. సమీపంలోని వారు అప్రమత్తమై ఆమె చేతిలో ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్నారు. కేసుల పని మీద వచ్చిన పోలీసులు ఆమెకు నచ్చజెప్పి స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. ‘‘నా తల్లి ఆస్తికి సంబంధించిన కేసులో సమీప బంధువు మోసం చేశాడు.. కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తానని చెప్పిన లాయరు మోసం చేశాడు. విసిగిపోయి నా తల్లి చనిపోయింది. తరువాత అయినా న్యాయం చేస్తారనుకుంటే చేయలేదు. అందుకే నా తల్లి సంవత్సరీకం రోజునే నేను కూడా చనిపోవాలనుకున్నా’’ అని మండ్రు కమలమ్మ కన్నీటి పర్యంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement