మారిన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి కోసం, కాసేపు ఆహ్లాదంగా గడపాలని భావిస్తున్నారు. ఇందుకు పార్కులను ఆశ్రయిస్తున్నారు. కానీ దాదపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు పాలకుల తీరుతో నిరుపయోగంగా మారింది. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. పలు ప్రదేశాలు మద్యం సీసాలు, చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. పార్కులు వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయిని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పచ్చదనంతో నింపాలని, చిన్న పిల్లలకు ఆట వస్తువులు, పెద్దలు వ్యాయామం చేయడానికి పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకునేలా ట్రాక్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


