గుంటూరు వెస్ట్(క్రీడలు): ఏపీ పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో వైజయంతి డెంటల్ కేర్ సౌజన్యంతో స్థానిక గోరంట్లలోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన గుంటూరు ఓపెన్ ఉమెన్ పికిల్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ముగిసినట్లు సంఘం కార్యదర్శి ఎన్.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
కార్యక్రమంలో జీవీఎస్ ప్రసాద్, నిర్వాహకకార్యదర్శి కె. అరుణ్ కుమార్, మన్సూర్ వల్లి, కె.రవి, శశిధర్, నెక్ట్స్ జెన్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జీజే కిషోర్ తదితరులు పాల్గొన్నారన్నారు.


