నగరంపాలెం: గుంటూరు, పల్నాడు జిల్లాలలో వాణిజ్య అవసరాలకు గృహావసరాల ఎల్‌పీజీ సిలెండర్లను అక్రమంగా వాడే దుకాణాలు, హోటళ్లపై గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగపు అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కట్టమూరి వారి వీధిలోని స్వీట్ షాప్‌లో తనిఖీ చేయగా, యాజమాని ఐదు గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నరసరావుపేట రోడ్‌లో ఐదు, గుంటూరు నగరంలోని లిబర్టీ సెంటర్‌లో బిర్యానీ హోటల్‌లో మూడు, ఓ కిచిడీ పాయింట్‌లో మూడు, ఆటోనగర్ ఇందిరానగర్ హోటల్‌లో ఐదు, కిచిడీ పాయింట్‌లో ఐదు సిలెండర్లను గుర్తించి స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 26 గృహ ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్లను సీజ్ చేసి, స్థానిక సీఎస్‌డీటీలకు అప్పగించారు.కేసులు నమోదు చేశారు. గుంటూరు ప్రాంతీయ విజిలెనన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.
● గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బృందాలుగా సోదాలు ● 26 సిలిండర్లు సీజ్ చేసి కేసులు నమోదు
Mar 13 2026 8:11 AM | Updated on Mar 13 2026 8:11 AM
● గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బృందాలుగా సోదాలు ● 26 సిలిండర్లు సీజ్ చేసి కేసులు నమోదు హోటళ్లలో విజిలెన్స్ తనిఖీలు
Advertisement
Advertisement


