ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లు పరిశీలన

Mar 9 2026 7:30 AM | Updated on Mar 9 2026 7:30 AM

గుంటూరు రూరల్‌: నగర శివారులోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డునందున్న శ్రీ కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందు కార్యక్రమం ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, మాజీ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ స్టేట్‌ మైనారిటీ ప్రెసిడెంట్‌ ఖాదర్‌ బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, కదిరి ఇన్‌చార్జి మక్బుల్‌బాషా, నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జి నూరిఫాతిమా, స్టేట్‌ మైనారిటీ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హఫీజ్‌ఖాన్‌, తెనాలి పరిశీలకుడు గులాం రసూల్‌లు పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే మైనారిటీ సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇచ్చే ప్రదేశాలు, పార్కింగ్‌, తదితర సౌకర్యాలను పరిశీలించి చర్చించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ మైనారిటీలకు రిజర్వేషన్‌ కల్పించి మైనారిటీలను ఒక స్థానంలో నిలబెట్టిన మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలతో ముందుకు సాగుతున్న మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈనెల 10వ తేదీన జరుగుతున్న ఇఫ్తార్‌ విందు కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ముస్లిం మైనారిటీలకు ప్రతి ఏటా జగనన్న ఇప్తార్‌ విందును పార్టీ స్థాపించిన నాటినుంచి ఇస్తూనే ఉన్నారని, ఇఫ్తార్‌ విందు కార్యక్రమాలను ప్రారంభించిన మహనీయుడు దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేసుకున్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షను చేస్తున్న ముస్లిం సోదరులకు జగనన్న ఇచ్చే విఽందులో పాల్గొని ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు సైదాఖాన్‌, తూర్పు నియోజకవర్గం అధ్యక్షుడు లియాఖత్‌, పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షుడు షర్బుద్దిన్‌, మైనారిటీ నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement