యడ్లపాడు: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ నాయకులు సోమవారం అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న ఆవులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. తుని నుంచి ఎ. ప్రతాపరెడ్డి, హెచ్ నాగేంద్ర అనే వ్యక్తులు మినీ లారీల్లో ఆవులను లోడ్ చేసుకుని వెళ్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు, స్థానిక ఎరక్రొండ వద్ద జాతీయ రహదారిపై ఆ వాహనాలను నిలిపివేసి తనిఖీ చేశారు. గోవుల తరలింపుపై వాహన చోదకులను ఆరా తీయగా, వారు ఎటువంటి అధికారిక అనుమతి పత్రాలను చూపలేకపోయారు. వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్‌న్‌కు తరలించారు. ఈ మేరకు అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, యడ్లపాడు మండల అధ్యక్షుడు తులాబందుల సత్యనారాయణ నేతృత్వం వహించగా, వంకాయలపాటి వంశీధర్, వి. నాగేశ్వరరావు, పి. మహేష్, బందెల శ్రీనివాసరావు, నక్క శ్రీనివాసరావు, నేలటూరి ఏసురత్నం, షేక్ సుభాని, తోట చందు, శ్రీరామ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వాహన యజమానులు మరియు డ్రైవర్లపై విచారణ చేపట్టారు.


