గుంటూరు ఎడ్యుకేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఈనెల 8న ప్రకటించిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అఖిల భారతస్థాయిలో అత్యధిక మార్కులతో పాటు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రభంజనం సృష్టించినట్లు సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. సోమవారం గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందకిషోర్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా సీఏ, సీఎంఏ కోర్సుల్లో 450కు పైగా ఆలిండియా ర్యాంకులను సాధించామని చెప్పారు. తాజా ఫలితాల్లో కె.చంద్రశేఖర్ 400 మార్కులకు గాను 308 మార్కులతో టాపర్‌గా నిలిచాడని తెలిపారు. అదే విధంగా ఏ.నాగసాయి 298, ఐ.జ్ఞానతేజ 297, బి.మణి 294, ఎం.సప్తగిరి 267 వంటి టాప్ మార్కులు సాధించారని తెలిపారు. సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు శ్రీమేధ అధ్యాపక, అధ్యాపకేతర బృంద సహకారం ఎంతగానో ఉందన్నారు. సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఏ ఇంటర్, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు సీఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా అన్నా నందకిషోర్, డైరెక్టర్ అన్నా శ్రీలక్ష్మి విద్యార్థులను అభినందించారు.


