శతాధిక వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధుడు మృతి

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

శతాధిక వృద్ధుడు మృతి

శతాధిక వృద్ధుడు మృతి

తెనాలి: రూరల్‌ మండల గ్రామం అంగలకుదురుకు చెందిన శతాధిక వృద్ధుడు కన్నెగంటి పెదపాములయ్య(110) శుక్రవారం ఉదయం మృతిచెందారు. 1915లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన వ్యవసాయం చేస్తూ, తనకున్న పరిజ్ఞానాన్ని తోటి రైతులకు పంచుతూ ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా నూట పదేళ్లు జీవించారు. ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ 22 ఏళ్ల క్రితమే మృతిచెందారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె, మనవ సంతానం ఉన్నారు. కుటుంబసభ్యులు వీరరాఘవయ్య, వెంకటేశ్వరరావు, కుమార్తె విజయలక్ష్మి, మనవలు, మునిమనవలు అంతా కలిసేవున్నారు. పాములయ్య మేనల్లుడు అశోక్‌ బాటిల్‌ కంపెనీ అధినేత ఉన్నవ శాయిబాబు. తదితర గ్రామపెద్దలు పాములయ్య అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement