పార్థసారథి అలంకారంలో నరసింహస్వామి | - | Sakshi
Sakshi News home page

పార్థసారథి అలంకారంలో నరసింహస్వామి

Mar 12 2026 7:37 AM | Updated on Mar 12 2026 7:37 AM

పార్థసారథి అలంకారంలో నరసింహస్వామి పురాతన బ్రిడ్జి పిల్లర్లు తొలగింపు గుంటూరు మహిళకు ఇండియన్‌ ఆర్ట్స్‌ అవార్డు

మంగళగిరి టౌన్‌: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో కోగంటి సునీల్‌కుమార్‌ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా నాగేశ్వరరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన పచ్చళ్ళ సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు.

నేడు శ్రీరంగనాయకులు అలంకారం...

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు శ్రీరంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈవో సునీల్‌కుమార్‌ కోరారు.

తాడేపల్లి రూరల్‌ : కృష్ణానది దిగువ ప్రాంతంలో బ్రిటీష్‌కాలం నాటి రైల్వే బ్రిడ్జి పిల్లర్లను తొలగించే కార్యక్రమాన్ని రైల్వే అధికారులు చేపట్టారు. మొదటి పిల్లర్‌ను పగలకొట్టడం ప్రారంభించి బుధవారానికి వారం రోజులు దాటింది. ఆ పిల్లర్‌ను సగం కూడా పగలకొట్టేందుకు భారీ బ్రేకర్‌ వల్ల కావడం లేదు. నల్లరాయి, సిమెంట్‌తో కట్టిన ఈ బ్రిడ్జి చాలా దృఢంగా ఉంది. సగం వరకు పిల్లర్‌ను పగలకొట్టి పెద్ద పెద్ద జేసీబీలు తీసుకువచ్చి తోసినా పిల్లర్లను కదలించలేకపోతున్నారు. కృష్ణానదిలో మొత్తం 15 పిల్లర్లు ఉన్నాయి. రైల్వే అధికారులు ఈ పిల్లర్లను తొలగించి డబుల్‌లైన్‌ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక పిల్లర్‌ పగలకొట్టడానికి సుమారు 15 రోజుల వ్యవధి పడుతుందని, 15 పిల్లర్లు తొలగించాలంటే రెండు బ్రేకర్లు 5 నెలలు సమయం పడుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఇండియన్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ సొసైటీ ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే పురస్కారాల్లో భాగంగా గుంటూరుకు చెందిన శాఖమూరు పద్మ పెయింటింగ్స్‌ అండ్‌ క్లే క్రాఫ్ట్‌స్‌ విభాగంలో ‘ఇండియా ఆర్ట్స్‌ 2026’ అవార్డు పొందారు. ఈ మేరకు బుధవారం శాఖమూరు పద్మ అవార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. సైన్స్‌లో బీఈడీ పట్టభద్రురాలైన పద్మ కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసి, పెయింటింగ్‌, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌స్‌పై ఉన్న మక్కువతో ఆయా అంశాల్లో బోధకురాలిగా మారారు. ఐదేళ్ల వయసు మొదలు అన్ని వయసుల వారికి వారి ఆసక్తికి అనుగుణంగా ఆర్ట్స్‌ నేర్పుతున్న పద్మ ప్రస్తుతం గుంటూరు జిల్లా లాం లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌స్‌ విభాగంలో పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement