ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం

Jun 3 2025 5:31 AM | Updated on Jun 3 2025 5:31 AM

ఐఐటీల

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్ల మనోగతం

బెంగళూరు ఐఐఎస్సీలో చేరతాను

మా స్వస్థలం గుంటూరు. నాన్న కిషోర్‌ చౌదరి ఆర్వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా, తల్లి పద్మజ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నారు. టెన్త్‌ ఐసీఎస్‌ఈ సిలబస్‌లో 588, ఇంటర్మీడియెట్‌లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 100 పర్సంటైల్‌తో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 18వ ర్యాంకు సాధించాను. తాజా ర్యాంకుతో బెంగళూరు ఐఐఎస్సీలో బీటెక్‌లో మాఽథమాటిక్స్‌ ఇన్‌ కంప్యూటర్‌లో చేరతాను

గుత్తికొండ సాయి మనోజ్ఞ, 152వ ర్యాంకు

గుంటూరు ఎడ్యుకేషన్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గుంటూరు నగరంలో చదివిన విద్యార్థుల్లో ఆరుగురు అఖిల భారతస్థాయి ఓపెన్‌ కేటగిరీలో 200 లోపు ర్యాంకులు సాధించారు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సోమిశెట్టి వెంకట సాయిచక్రి అఖిల భారతస్థాయి ఓపెన్‌ కేటగిరీలో 33వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. రాష్ట్రస్థాయిలోనే ఇది అత్యుత్తమ ర్యాంకు. తండ్రి శ్రీరామమూర్తి వ్యాపారం చేస్తుండగా, తల్లి సుజాత గృహిణి. పదవ తరగతి, ఇంటర్‌ గుంటూరులోని భాష్యంలో చదివిన సాయి చక్రి టెన్త్‌లో 572, ఇంటర్‌లో 965 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో 99.96 పర్సంటైల్‌తో 646వ ర్యాంకు కై వసం చేసుకున్న సాయిచక్రి తాజాగా అడ్వాన్స్‌లో ఓపెన్‌ కేటగిరీలో 33వ ర్యాంకు సాధించాడు. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో చేరతానని చెబుతున్న సాయిచక్రి సైబర్‌ టెక్నాలజీ రంగంలో నిపుణుడుగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నాడు. సైబర్‌క్రైమ్‌లను నివారించే ఆశయంతో ముందుకు వెళ్లాలనే ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు.

ముంబై ఐఐటీలో చేరతాను

మా స్వస్థలం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం. నాన్న వీరపునాయుడు లారీ ట్రాన్స్‌పోర్ట్‌లో పని చేస్తారు. అమ్మ వసంత గృహిణి. ఆరో తరగతి నుంచే గుంటూరులో చదువుతున్నాను. టెన్త్‌లో 588, ఇంటర్‌లో 984 మార్కులు సాధించాను. తాజా ర్యాంకు ఆధారంగా ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో చేరతాను. బీటెక్‌ తరువాత ఐఏఎస్‌కు ప్రిపేర్‌ కావాలనే లక్ష్యంతో ఉన్నాను.

– ఎన్‌. ఆకాష్‌, 108వ ర్యాంకు

పరిశోధనలు చేయాలనే ఆసక్తి

మా స్వస్థలం గుంటూరులోని ఏటీ అగ్రహారం. నాన్న భాను కృష్ణారావు లోకో పైలెట్‌. అమ్మ పద్మజ గృహిణి. తాజా ర్యాంకు ఆధారంగా బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో మాథమాటిక్స్‌ ఇన్‌ కంప్యూటర్స్‌ కోర్సులో చేరతాను. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాను.

– ఎం. శ్రీకర గణేష్‌, 104వ ర్యాంకు

పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను

మా స్వస్థలం సత్తెనపల్లి. నాన్న కోటేశ్వరావు ఇనుమెట్ల జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అమ్మ కోటేశ్వరమ్మ డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఐఐటీ ముంబైలో సీఎస్‌ఈలో చేరతాను. ప్లాస్టిక్‌ కారణంగా పర్యావరణానికి కలుగుతున్న విఘాతానికి పరిష్కారం చూపేందుకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను.

డి.జస్వంత్‌ బాలాజీ, 151వ ర్యాంకు

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతాను

మా స్వస్థలం గుంటూరు. నాన్న టి.పిచ్చయ్య, విజ్ఞాన్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌. అమ్మ ఇవాంజిలిన్‌ విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలు. కంప్యూటర్‌ సైన్స్‌కు భిన్నంగా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేయాలనే లక్ష్యంతోఉన్నాను. ముంబైలో ఈ.ఈ బ్రాంచ్‌లో చేరతాను.

టి.విక్రమ్‌ లెవీ, 146వ ర్యాంకు

పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను

మా స్వస్థలం సత్తెనపల్లి. నాన్న కోటేశ్వరావు ఇనుమెట్ల జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అమ్మ కోటేశ్వరమ్మ డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఐఐటీ ముంబైలో సీఎస్‌ఈలో చేరతాను. ప్లాస్టిక్‌ కారణంగా పర్యావరణానికి కలుగుతున్న విఘాతానికి పరిష్కారం చూపేందుకు పర్యావరణ పరిరక్షణ దిశగా పరిశోధనలు చేస్తాను.

డి.జస్వంత్‌ బాలాజీ, 151వ ర్యాంకు

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం 1
1/4

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం 2
2/4

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం 3
3/4

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం 4
4/4

ఐఐటీల్లో సీట్లు సాధిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement