న్యూజిలాండ్‌లో వై.ఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలు
ముఖ్య అతిథిగా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం న్యూజిలాండ్‌లో ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పరిపాలనలో వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, సంక్షేమాన్ని వారి గడప ముందుకు చేర్చారని తెలిపారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అయ్యే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. న్యూజిలాండ్ (ఎన్‌ఆర్‌ఐ) కన్వీనర్ నెల్లూరి బుజ్జిబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు న్యూజిలాండ్‌లో నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు మౌంట్ ఆల్చర్ట్ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ హాజరయ్యారు. కార్యక్రమంలో గోవర్ధన్ మల్లెల కళ్యాణ్ కసుంగాటి, బాల బీరమ్, ఇందిరా సిరిగిరి, వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, శివ కిలారి, జనక్, అరుణ్‌రెడ్డి, చంద్రశేఖర్ కోడూరి, మురళి, రోహిత్‌రెడ్డి, రామ్‌మోహన్ దంతాల, ప్రదీప్, నిర్మల్ పాండే, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ పానుగంటి పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్: జిల్లా అగ్నిమాపక భవనం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం శంకుస్థాపన చేశారు. భవనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రూ.3.39 కోట్లతో నిర్మించనున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆకాక్షించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం.ఎ.క్యూ జిలానీ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
తెనాలిఅర్బన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్వామివారిని వరాహావతారంతో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తాడికొండ: అమరావతి రాజధానికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి గత మూడు నెలలుగా గుంతలమయంగా మారడంతో పంట లు అధ్వానంగా తయారయ్యాయి. మరమ్మతుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తుండటంతో ఇప్పటికే పూర్తిగా పాడైన పెదపరిమి–తుళ్లూరు మధ్య రహదారిపై దుమ్ము లేచి పంటలు పనికిరాకుండా పోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి నెల దాటినా అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో అటు రైతులతో పాటు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇలా ఉండటం పట్ల అంతా మండిపడుతున్నారు.
న్యూజిలాండ్‌లో వై.ఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలు
న్యూజిలాండ్‌లో వై.ఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలు
న్యూజిలాండ్‌లో వై.ఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలు


