ముస్తాబుతో బోధనకు ఆటంకం
విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి,తరగతి, గృహం, పరిసరాల పరిశుభ్రత గురించి ఉపాధ్యాయులు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు చేయవలసిన పనులకు కూడా ఉపాధ్యాయులనే బాధ్యులను చేయడం బాధాకరం. ముస్తాబుపై ఎక్కువ దృష్టి సారిస్తే బోధనకు ఆటంకం ఏర్పడుతుంది. అంత గౌరవం కూడా ఉండదు. ఈ కాన్సెప్ట్‌పై గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు చేరవేస్తే మంచిది. ప్రవీణ్ ప్రకాషే బాధపెట్టాడనుకుంటే అంతకు మించిన బాధను ఇప్పుడు పెడుతున్నారు.
– కె.బసవలింగారావు,
అధ్యక్షుడు, ఏపీటీఎఫ్, గుంటూరు జిల్లా


