రైతన్నకు అండగా పంట కోసే యంత్రం
స్మార్ట్ మల్టీపర్పస్ చైర్
విభిన్న ప్రతిభావంతులకు బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే సౌరశక్తితో పని చేసే చైర్‌ను మంగళగిరిలోని సీకే జూనియర్ కాలేజీ ఎయిడెడ్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థినులు ఎం. మాన్యశ్రీ , ఏ. కౌశిక్ గైడ్ టీచర్ బి. టైటస్ సహకారంతో రూపొందించారు. అడ్జస్ట్ చేసుకునే టేబుల్, ఆటోమెటిక్‌గా సెన్సార్ ద్వారా తాగునీరు, హ్యాండ్‌వాష్ బేసిన్, లైట్, ఫ్యాన్‌తో పాటు కుర్చీని బెడ్‌గా మార్చుకునే విధానం బాగుంది.
ఇటీవల చైన్నెలో వరదలతో ప్రజలు పడిన ఇబ్బందులను గుర్తించిన విద్యార్థులు డి.మల్లిఖార్జున్, టి. విలియం కేరీ, సీహెచ్. శివ శంకర్ ఫ్లడ్ గేట్ ప్రాజెక్టుతో పరిష్కారం చూపించారు. పెదనందిపాడు మండలం అనపర్రు జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు నూతన ఆలోచనతో ఇంటి ముందు ఇనుప గేటును బిగించడం ద్వారా వరద నీరు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే మార్గాన్ని చూపారు.
రైతన్నలకు అండగా నిలిచి పంటలను కోసే యంత్రాన్ని తక్కువ ఖర్చుతో వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు పీఎస్‌ఎస్ జెడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులు షేక్ అర్షద్, కె.భావేజ్ రూపొందించారు. ట్రాక్టర్‌కు వెనుకవైపు రెండు వైపులా తిరిగే రంపాన్ని అమర్చి, దాని ద్వారా పొలంలో గడ్డిని, పంటను సులువుగా కత్తిరించవచ్చు. రైతు ప్రయోజనకారిగా దీనికి రూపకల్పన చేశారు.
రైతన్నకు అండగా పంట కోసే యంత్రం
రైతన్నకు అండగా పంట కోసే యంత్రం
రైతన్నకు అండగా పంట కోసే యంత్రం
రైతన్నకు అండగా పంట కోసే యంత్రం


