వక్ఫ్ భూముల్లో పరిశ్రమలు పెట్టనివ్వం
చిన కాకాని గ్రామంలో వక్ఫ్ బోర్డ్‌కు సంబంధించిన 77.57 ఎకరాల భూమిలో ప్రభుత్వం ఇండస్ట్రియల్, ఐటీ పార్క్ ఏర్పాటుకు సిద్ధమవ్వడాన్ని ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఆ భూములు ముస్లిం, మైనారిటీల విద్య, ఇతర అభివృద్ది కోసం కేటాయించాలి. ప్రభుత్వం ఆలోచనలు అమలుకు ఏమాత్రం ఒప్పుకోం.
–సయ్యద్ సలావుద్దీ,
ముస్లిం సమైక్య వేదిక నాయకులు
2005 ఉపాధి హామీ హక్కు చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరు మార్చడంతోపాటు కొత్త నిబంధనలు పెట్టి బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలను విరమించుకోవాలి. పేదవాడికి అన్యాయం చేసే కూటమి సర్కార్ ఆగడాలను సహించే ప్రసక్తే లేదు. దీనిపై ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం.
–పాశం రామారావు, కౌలు,
వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు
వక్ఫ్ భూముల్లో పరిశ్రమలు పెట్టనివ్వం


