అర్జీదారులతో మర్యాదగా మెలగండి
డీఆర్‌ఓ షేక్ ఖాజావలి
గుంటూరు వెస్ట్: అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్‌ఓ అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అనంతరం వచ్చిన 184 అర్జీలను డీఆర్‌ఓతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, డీపీఓ సాయి కుమార్, స్టెప్ సీఈఓ చంద్రముఖి, జిల్లా అధికారులు పరిశీలించారు.
ఆదారం లేదు..
ఆదుకోండి
నా రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. తండ్రి లేరు. అమ్మ కుట్టుమిషన్ సంపాదనతో నెట్టుకొస్తున్నాం. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఉండడానికి ఇల్లు కూడా లేదు. నాకు చిన్న ఇల్లు ఇప్పించండి.
– సీహెచ్ మౌనిక, తల్లి విజయలక్ష్మి,
గుంటూరు
కాళ్లు విరగ్గొట్టారు..
పౌరహిత్యం చేసుకుని ఉన్నదాంట్లో తింటూ నెట్టుకొస్తున్నాం. ఇంటి నిర్మాణ సమయంలో మెట్ల ఉమాదేవి అనే మహిళ వద్ద నగదును అప్పుగా తీసుకుని 85 శాతానికి పైగా చెల్లించినా ఆమె రౌడీయిజం చేస్తుంది. రెండు రోజుల క్రితం ఇంటిపై దాడికి వచ్చి కాళ్లు విరగ్గొట్టించింది. నా బిడ్డలపైనా చేయిచేసుకున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు. కాపాడండి
– ఘంటసాల పార్వతీ నందన్,
కుటుంబ సభ్యులు, పొన్నూరు
అర్జీదారులతో మర్యాదగా మెలగండి
అర్జీదారులతో మర్యాదగా మెలగండి


